టెట్, డీఎస్సీ పరీక్షల మధ్య గడువు
ఏపీ డీఎస్సీ, టెట్ పరీక్షల(AP DSC TET Exams) నిర్వహణపై హైకోర్టు(High Court) సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. టెట్, డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ను మార్చాలని ఆదేశించింది. పరీక్షల మధ్య 4 వారాల సమయం ఉండాలని ప్రభుత్వానికి సూచించింది. రాత పరీక్ష అనంతరం కీ పై అభ్యంతరాలు స్వీకరణలు సమయం ఇవ్వాలని తెలిపింది. మార్చి 15 నుంచి నిర్వహించాలని నిర్ణయించిన డీఎస్సీ షెడ్యూల్‌ను(DSC Exam Schedule) హైకోర్టు సస్పెండ్ చేసింది. ఏపీ టెట్ పరీక్ష ఫలితాలు మార్చి 14న వస్తాయని, మార్చి 15 నుంచి డీఎస్సీ పరీక్షలు పెడుతున్నారని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన కోర్టు… టెట్, డీఎస్సీ పరీక్ష మధ్య నాలుగు వారాల గడువు ఉండాలని ఆదేశించింది. పిటిషనర్ల తరపున న్యాయవాది జువ్వాడి శరత్ చంద్ర హైకోర్టు వాదనలు వినిపించారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు రెండు సెషన్స్‌లో టెట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తం 2,67,559 మంది టెట్‌కు దరఖాస్తు చేసుకోగా.. 120 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు.