AP TET New Schedule : ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(ఏపీ టెట్) షెడ్యూల్ మారింది. గత షెడ్యూల్ లో ప్రభుత్వం మార్పులు చేసింది. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు డీఎస్సీ, టెట్ పరీక్షలకు 90 రోజుల ప్రిపరేషన్ సమయం ఇచ్చింది ప్రభుత్వం. ఈ మేరకు తాజాగా కొత్త షెడ్యూల్ విడుదలైంది. జులై 2 విడుదలైన టెట్ నోటిఫికేషన్ ప్రకారం ఆగస్టు 5 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు జరగాల్సి ఉండగా, ఈ పరీక్షలను అక్టోబర్ 3 నుంచి 20 వరకు నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ తాజాగా ప్రకటించింది. ఏపీలో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.