Uncategorized

ఐటీ ఉద్యోగుల కారు ర్యాలీకి నో పర్మిషన్, గరికపాడు వద్ద పోలీస్ పికెటింగ్-it employees car rally from hyderabad to rajahmundry to protest on chandrababu arrest police denied permission ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


కారు ర్యాలీకి నో పర్మిషన్

ఐటీ ఉద్యోగుల “కారులో సంఘీభావ యాత్ర”కు ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమీషనరేట్ పరిధిలో ఎటువంటి అనుమతులు లేవని డిప్యూటీ పోలీస్ కమిషనర్ విశాల్ గున్నీ తెలిపారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సామాజిక మాధ్యమాలలో ఈ నెల 24న హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు హైదరాబాద్ ఐటీ ఉద్యోగులు “కారులో సంఘీభావ యాత్ర” తలపెట్టినట్లు ప్రచారం జరుగుతోందన్నారు. ఈ విషయమై ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమీషనరేట్ పరిధిలో ఏవిధమైన వాహన ర్యాలీలకు అనుమతులు ఇవ్వలేదన్నారు. కాబట్టి నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి ర్యాలీలను ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించి నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తారో వారిపై ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం సెక్షన్ 143, 290,188, R/W 149, సెక్షన్ 32 పోలీసు యాక్ట్, పి.డి.పి.పి.చట్టం సెక్షన్ 3 కింద కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వాహనాల యజమానులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయం గమనించి అనుమతి లేని కారు యాత్రలో పాల్గొనవద్దని విశాల్ గున్నీ సూచించారు.



Source link

Related posts

Balakrishna : ఒకడు నాశనం చేస్తాడు, హీరో జైలు నుంచి బయటకు రావాలి- అన్ స్టాపబుల్ లో బాలయ్య పొలిటికల్ పంచ్ లు!

Oknews

ఏపీలో మళ్లీ చిరుత దాడి, చిత్తూరు జిల్లాలో మహిళకు తీవ్రగాయాలు!-chittoor leopard attacks woman in yerraguntapalli query seriously injured ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Letters to CBN: రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు పోటెత్తుతున్న అభిమానుల లేఖలు

Oknews

Leave a Comment