పెళ్ళైనప్పటి నుంచి భర్త సునీల్ కుమార్ నాయక్, అత్త మామలు బీకి భాయ్, చిన్న బాధ్యా నాయక్‌లు తనను వేధిస్తున్నారని, మానసికంగా హింసిస్తున్నారని పద్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యా దులో పేర్కొన్నారు. అదనపు కట్నం తీసుకురావాలని, మాటలతో వేధిస్తున్నారని సూర్యారావుపేట పోలీసులకు సోమవారం రాత్రి ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు ఉన్నతాధికారుల ఆదేశాలతో భారతీయ న్యాయ సంహిత చట్టం 85, 3, 4 డి. పి.ఎ. సెక్షన్ల కింద ఐపీఎస్ అధికారిపై కేసు నమోదు చేశారు.