Health Care

ఐస్ బాత్ అంటే పడిచచ్చిపోతున్న సెలబ్రెటీలు.. అసలు దాని వెనుక ఉన్న సీక్రెట్ ఏంటో తెలుసా?


దిశ, ఫీచర్స్: ఈ మధ్య కాలంలో సెలబ్రెటీలు ఎక్కువగా ఐస్ బాత్ చేస్తున్నారు. ఇందుకు సంబంధంచిన ఫొటోలను, వీడియోలను సైతం సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. అయితే.. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా..? అసలు ఈ ఐస్ బాత్ ఏంటీ? ఎందుకు సెలబ్రెటీలు దానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని ఆలోచించారా. నిజానికి ఈ ఐస్ బాత్ వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయట. అసలు ఈ ఐస్ బాత్ అంటే ఏంటో తెలుసుకుందాం..

ఐస్ బాత్:

ఐస్ వాటర్ అంటే బాగా చల్లని నీటిలో స్నానం చేయడాన్నే ఐస్ బాత్ అంటారు. దీనిని క్రియోథెరపీ అని కూడా పిలుస్తారు. ఈ వాటర్‌లో వ్యక్తి 11 నుంచి 15 నిమిషాలు ఉంటాడు. ఇది సాధారణంగా వ్యాయామం తర్వాత ఆరోగ్య ప్రయోజనాల కోసం చేసే ఒక థెరపీ. ఇలా చెయ్యడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతున్నాయి. అయితే ఇది 50 నుంచి 59 డిగ్రీల ఫారెన్ హీట్ మధ్య మాత్రమే చెయ్యాలి. అందుకే ఈరోజుల్లో సెలబ్రెటీలు సైతం ఐస్ బాత్ చేసేందుకు ముందుకు వస్తున్నారు. మరి ఈ ఐస్ బాత్ కారణంగా కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

ప్రయోజనాలు:

* ఐస్ బాత్ కారణంగా కండరాలు పునరుద్ధరణ వేగవంతం అవుతుంది. అలాగే అవి బలోపేతంగా మారి దెబ్బ తగిలే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

* చల్లటి నీటిటో స్నానం చేయడం వల్ల రక్త ప్రసరణను మెరుగుపడుతోంది.

* అంతే కాకుండా ఈ ఐస్ బాత్ కారణంగా మానసిక ఆరోగ్యం మెరుగుపడుతోందట. ఇందులో స్నానం చెయ్యడం వల్ల మనసులో ఆందోళనను తగ్గించి ప్రశాంతంగా ఉండేలా చేస్తుందట.

* ఐస్ బాత్ రోగనిరోధక శక్తిని పెంచి వ్యాధులు భారీన పడకుండా రక్షిస్తుందట.

* చల్లని వాటర్‌తో స్నానం చర్మానికి మేలు చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. ఇవి చర్మ రంధ్రాలను బిగుతుగా చేసి.. చర్మం మెరిసిపోయేల చేస్తుందట.

గమనిక:

అయితే ఐస్ బాత్ చేసే టప్పుడు తప్పక కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. చల్లటి నీటిలో ఎక్కువగా ఉండటం వల్ల చర్మం, నరాల సున్నితత్వం, అల్పోష్ణస్థితి, గుండె సమస్యలకు కూడా కారణమవుతుంది. అంతే కాకుండా కొన్ని సందర్భాల్లో హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయట. కాబట్టి శరీర తత్వాన్ని బట్టి.. 15 నిమిషాల కంటే ఎక్కువ కాలం ఐస్ బాత్‌లో ఉంటే మంచిది కాదని చెబుతున్నారు. కాగా.. ఇలాంటివి ట్రైనర్స్ పర్యవేక్షణలో చేయడం ఇంకా బెటర్ అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నిపుణులు.



Source link

Related posts

ఆకలితో ఉన్నప్పుడు నిజంగా కోపం వస్తుందా? ఇది మన భ్రమేనా?

Oknews

ఆఫ్రికన్ ప్రజలను చంపుతున్న సముద్ర తాబేలు.. కారణం అదేనా..

Oknews

అద్దెకు ద్వీపం.. గంటకు రూ.154,166 మాత్రమే..

Oknews

Leave a Comment