ఒకరిపై ట్రోలింగ్.. మరొకరిపై ప్రశంసలు


తను తీసిన సూపర్ హిట్ సినిమా రీ-రిలీజ్ అవుతుంటే ఏ దర్శకుడికైనా ఆనందమే. రీ-రిలీజ్ సందర్భంగా మరోసారి ఆడియన్స్ తో టచ్ లోకి వస్తారు.. పాత జ్ఞాపకాల్ని నెమరువేసుకుంటారు. ఇప్పుడు ఇద్దరు దర్శకులు తమ పాత సినిమాల రీ-రిలీజెస్ తో రెడీ అవుతున్నారు. అయితే ఒకరిపై ప్రశంసలు కురుస్తుంటే, మరొకరిపై ట్రోల్స్ నడుస్తున్నాయి.

రీ-రిలీజ్ కు సిద్ధమైన ఆ సినిమాలు మురారి, శివ కాగా.. ఆ దర్శకులు కృష్ణవంశీ, రామ్ గోపాల్ వర్మ.

మహేష్ ను హీరోగా పెట్టి మురారి సినిమా తీశాడు కృష్ణవంశీ. మళ్లీ ఇన్నేళ్లకు ఆ సినిమా రీ-రిలీజ్ అవ్వబోతోంది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటున్నాడు కృష్ణవంశీ.

ఒక్కో సీన్ ను విడమర్చి, స్క్రీన్ షాట్స్ పెట్టి మరీ కృష్ణవంశీని మెచ్చుకుంటున్నారు మహేష్ ఫ్యాన్స్. తమ హీరోతో మరో సినిమా చేయాలంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. మహేష్ కెరీర్ ప్రారంభంలో అతడి నుంచి బెస్ట్ పెర్ఫార్మెన్స్ ను కృష్ణవంశీ మాత్రమే రాబట్టుకున్నాడంటూ పొగిడేస్తున్నారు.

ఇక శివ సినిమా కూడా రీ-రిలీజ్ కు రెడీ అయింది. నాగార్జునను హీరోగా పెట్టి రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమా ఇది. ఆర్జీవీకి అదే తొలి సినిమా. ఆ సినిమాతో అతడు బ్లాక్ బస్టర్ కొట్టడమే కాదు, టాలీవుడ్ గతిని మార్చేశాడు.

ఇలాంటి కల్ట్ సినిమా రీ-రిలీజ్ కు రెడీ అవుతుంటే, ఆర్జీవీపై ప్రశంసలు కురిపించడం మానేసి విమర్శలు గుప్పిస్తున్నారు చాలామంది. “ఏళ్లుగా పిచ్చి సినిమాలు తీస్తున్న ఆర్జీవీ తను తీసిన శివ సినిమాను రీ-రిలీజ్ సందర్భంగా థియేటర్లలో కనీసం 10 సార్లు చూడాలంటూ” ఓ నెటిజన్ రియాక్ట్ అవ్వగా.. శివ సినిమా చూసిన తర్వాతైనా ఆర్జీవీ తన మనసు మార్చుకుంటాడేమో అని మరికొందరు అభిప్రాయపడ్డారు.

ఇలా ఒకేసారి ఇద్దరు దర్శకుల సినిమాలు రీ-రిలీజ్ కు రెడీ అవుతుంటే.. ఓ దర్శకుడిపై ప్రశంసలు, మరో దర్శకుడిపై విమర్శలు పడుతున్నాయి. గమ్మత్తైన విషయం ఏంటంటే.. ప్రశంసలు అందుకుంటున్న కృష్ణవంశీ మురారితో మహేష్ కు యావ‌రేజ్ హిట్ ఇవ్వగా ఇవ్వగా.. విమర్శలు ఎదుర్కొంటున్న ఆర్జీవీ, శివతో నాగార్జునకు పెద్ద హిట్టిచ్చాడు.

The post ఒకరిపై ట్రోలింగ్.. మరొకరిపై ప్రశంసలు appeared first on Great Andhra.



Source link

Leave a Comment