Entertainment

ఒక్కరిని బ్రతికించుకోవడానికి 8 మంది ఆత్మహత్య చేసుకోవాలా?


ఎన్ని జోనర్స్‌లో సినిమాలు వచ్చినా.. హారర్‌ జోనర్‌కి ఒక ప్రత్యేకత ఉంది. మంచి కథ, కథనాలతో సినిమా చేస్తే ట్రెండ్‌తో సంబంధం లేకుండా అలాంటి సినిమాలు విజయం సాధిస్తాయి. ఈ విషయం ఎన్నోసార్లు ప్రూవ్‌ అయింది. అందుకే కొంతమంది దర్శకనిర్మాతలు అలాంటి సినిమాలు చెయ్యడానికే ఎక్కువ మొగ్గు చూపుతుంటారు. 

ఇప్పటివరకు వచ్చిన హారర్‌ మూవీస్‌కి భిన్నంగా ఓ విభిన్న కథాంశంతో ‘ది గ్రేట్‌ ఇండియన్‌ సూసైడ్‌’ అనే సినిమా రాబోతోంది. ఈ సినిమాను థియేటర్స్‌లో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్‌ చేసేస్తున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’లో అక్టోబర్‌ 6 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సినిమా కథను ఒక్క ముక్కలో చెప్పాలంటే.. చనిపోయిన ఒక వ్యక్తిని బ్రతికించుకోవడానికి 8 మంది ఆత్మహత్యకు పాల్పడతారు. ఇది మదనపల్లి ప్రాంతంలో యదార్థంగా జరిగిన కథగా ప్రొజెక్ట్‌ చేస్తున్నారు. హెబ్బా పటేల్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో నరేష్‌, పవిత్రా లోకేష్‌, జయప్రకాశ్‌ ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించబోతున్నారు.

చనిపోయిన ఒక వ్యక్తిని బ్రతికించుకోవడానికి 8 మంది కుటుంబ సభ్యులు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలని భావించారు? ‘బళ్లారి నీలకంఠంగారు.. మా పెదనాన్న. ఈ విధిని, డెస్టినీని మార్చలేమా అనుకుంటూ ఆయన చావుకు కారణం వెతుకుతుంటే, అనుకోకుండా వారిని బతికించుకునే దారి కనిపించింది. ఆయన కోసం ఆయన్ని ప్రేమించే వాళ్లు, బలంగా కోరుకొని ప్రాణ త్యాగం చేస్తే మళ్లీ ఆయన తిరిగి వచ్చే అవకాశం ఉందట’ అంటూ హెబ్బా పటేల్‌ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్‌ మొదలవుతుంది. ఇందులోని డైలాగ్స్‌గానీ, సీన్స్‌గానీ ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. అలాగే సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా సినిమాకి ప్లస్‌ అయ్యే అవకాశం ఉంది. 



Source link

Related posts

మెగా మల్టీస్టారర్.. ఒకే సినిమాలో చిరు, పవన్, చరణ్!

Oknews

రాజ్ తరుణ్ కి సపోర్ట్ గా లావణ్య తండ్రి.. అవసరమైతే ఆస్థి మొత్తం అమ్మేస్తా

Oknews

బన్నితో ఆ క్రేజీ డైరెక్టర్‌ సినిమా ఉంటుందా?

Oknews

Leave a Comment