ఈమధ్య ఓటీటీలకు ఎంత ప్రాధాన్యం పెరిగిందో అందరికీ తెలిసిందే. థియేటర్లలో కంటే ఓటీటీలో సినిమాలు చూసేందుకే ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. శుక్రవారం వచ్చిందీ అంటే థియేటర్లకు పోటీగా ఓటీటీల్లో సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. సినిమాలతోపాటు వెబ్ సిరీస్‌లను, టీవీ షోలను అందుబాటులోకి తెస్తున్నాయి ఓటీటీ సంస్థలు.
ఇవన్నీ పలు భాషల్లో అందుబాటులో ఉండడంతో ఇప్పుడు ఓటీటీలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ప్రేక్షకులు. ఇక ఈ వారంలో శుక్రవారం ఒక్కరోజే 21 సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ కాబోతున్నాయి. అవేమిటో ఓసారి చూద్దాం…