ఒక్క రూపాయి కూడా తీసుకోని మహారాజు Great Andhra


ప్రతి సినిమాకు తమ పారితోషికాన్ని పెంచేస్తున్న రోజులివి. హిట్స్ వచ్చినా, ఫ్లాప్స్ వచ్చినా హీరోల రెమ్యూనరేషన్లు మాత్రం పెరిగిపోతున్నాయి. ఫుల్ పేమెంట్ ఇవ్వకపోతే డబ్బింగ్ చెప్పని హీరోలు కోకొల్లలు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా సినిమా చేసే హీరో ఉంటాడా?

ఉన్నాడు.. అతడే విజయ్ సేతుపతి. ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన మహారాజ సినిమా కోసం విజయ్ సేతుపతి పారితోషికం తీసుకోలేదు. ఈ సినిమా మొత్తం ఫ్రీగా చేశాడు. సినిమా రిలీజైన తర్వాత లాభాల్లో వాటా తీసుకున్నాడు.

సినిమా వంద కోట్ల వసూళ్లు సాధించింది. ఓటీటీ, శాటిలైట్ రూపంలో కూడా భారీగా డబ్బులొచ్చాయి. కాబట్టి విజయ్ సేతుపతికి కూడా డబ్బు బాగానే వచ్చింది. అయితే ఇక్కడ మేటర్ అది కాదు.

ఈ సినిమాను లో-బడ్జెట్ లో తీయాలనేది అందరి ఆలోచన. ఆ టైమ్ లో నిర్మాతలు కూడా కాస్త ఇబ్బందుల్లో ఉన్నారట. అందుకే సినిమాను కేవలం 20 కోట్ల రూపాయల్లో పూర్తిచేశారు. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇదే నిజం. మహారాజ సినిమా ప్రొడక్షన్ కాస్ట్ అక్షరాలా రూ.20 కోట్లు.

అందుకే ఈ సినిమా కోసం డబ్బులు తీసుకోలేదు విజయ్ సేతుపతి. కథ నచ్చితే ఫ్రీగా చేయడానికి కూడా తను సిద్ధమని ఇప్పటికే పలుమార్లు ప్రకటించిన ఈ నటుడు, మహారాజ సినిమాతో చెప్పింది చేసి చూపించాడు.

విజయ్ సేతుపతికి ఈ సినిమాతో భారీగా లాభం వచ్చిందనే సంగతి పక్కనపెడితే.. మహారాజ సినిమా అతడిలో నటుడ్ని మరోసారి నిలబెట్టింది. ఈ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా, ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన రాబట్టుకున్నాడు. కెరీర్ లో విజయ్ సేతుపతికి ఇది 50వ చిత్రం.



Source link

Leave a Comment