Health Care

ఒక వ్యక్తి వారంలో ఎంత మద్యం తాగాలో తెలుసా?


దిశ, ఫీచర్స్ : మద్యం ఆరోగ్యానికి హానికరం అని టీవీ యాడ్స్, మందు బాటిల్స్ పై ఉన్నా, అవన్నీ పట్టించుకోకుండా చాలా మంది మద్యం సేవిస్తూ ఉంటారు. ఈమధ్య కాలంలో యూత్ నుంచి పెద్దవారి వరకు చాలా మంది విపరీతంగా మందు తాగుతున్నారు. ఏ చిన్న పార్టీ లేదా ఫంక్షన్ జరిగినా సరే తప్పకుండా అక్కడ మద్యం ఉండాల్సిందే. ఇక కొంత మంది ప్రతి రోజూ ఆల్కహాల్ తాగుతూ చాలా ఎంజాయ్ చేస్తుంటారు. కానీ అది వారి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని ఆలోచించరు. మద్యం సేవిచడం కొంత వరకు బెటరే కానీ, అది అతిగా తాగితే మాత్రం చాలా ఇబ్బందులు వస్తాయంట.

ఈ మధ్య కాలంలో చాలా మంది అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఆల్కహాల్ అతిగా తీసుకునే వారు లివర్ సంబంధిత వ్యాధులు, గుండె సంబంధ వ్యాధులతో సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందువలన వైద్యులు చాలా తక్కువ లిమిట్‌తో మద్యం సేవించాలని చెబుతున్నారు. అయితే తాజా సర్వే ప్రకారం, ఒక వ్యక్తి వారానికి కొంత లిమిట్ వరకు మద్యం సేవిస్తే ఎలాంటి సమస్యలు రావు. కాగా, దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పెద్దలు వారానికి 10 కంటే ఎక్కువ పెగ్గులు, రోజుకు 4 కంటే ఎక్కువ పెగ్గులు తీసుకోకూడదటున్నారు నిపుణులు. అదే వైన్ విషయానికొస్తే.. 150 mlని ఒక పెగ్గుగా పరిగణించారు.(ఈ లెక్కన విస్కీ, రమ్, జిన్ వంటి వాటిని వారానికి 300 ml కంటే ఎక్కుగా తీసుకోకూడదు. ఇక బీర్ విషయానికొస్తే.. మందుబాబులు బీర్‌ను బాటిళ్లకు బాటిళ్లు లాగిస్తారు. కానీ బీర్‌ను వారానికి ఆరు పెద్ద బాటిళ్ల కంటే ఎక్కువగా తీసుకోకూడదు.



Source link

Related posts

Not Just Cervical Cancer Prevention In Women, HPV Vaccine Is Important For Men Too | Health News

Oknews

Happy Fathers Day : నాన్న.. ఈ టెస్ట్ చేయించుకో..

Oknews

మురికి కాళ్ల ఫోటోతో లక్షలు సంపాదిస్తున్న వ్యక్తి.. ఎలాగో చూడండి..

Oknews

Leave a Comment