Health Care

ఒత్తిడిలో ఉన్నప్పుడు జంక్ ఫుడ్ తింటున్నారా?.. ఈ నిజాలు తెలిస్తే అస్సలు ముట్టుకోరు!


దిశ, ఫీచర్స్ : హై కొలెస్ట్రాల్ ఉండే ఆహారాలు, ముఖ్యంగా పిజ్జా, బర్గర్ వంటి జంక్ ఫుడ్స్ తినడం ఆరోగ్యానికి మంచిది కాదన్న విషయం మనకు తెలిసిందే. అయితే ఒత్తిడికి గురైనప్పుడు వీటిని తినడం మరింత ప్రమాదకరమని నిపుణులు చెప్తున్నారు. అధిక కొవ్వు ఉండే ఆహారం తిన్నప్పుడు అది జీర్ణ వ్యవస్థలోని గట్ బ్యాక్టీరియా మనుగడకు అంతరాయం కలిగించడంవల్ల ఆ ప్రభావం బిహేవియర్ మీద కూడా పడుతుంది.

నిజానికి మానసిక ఒత్తిడి ఎక్కువైనప్పుడు అధిక కేలరీలు కలిగిన ఆహారం మీదకు మనసు లాగుతుందట. అందుకే ఈ సమయంలో బాధితులు జంక్ ఫుడ్ తినడానికి, డ్రింక్ చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. ఇవి నేరుగా మెదడుపై ప్రభావం చూపుతాయని ఆహార నిపుణులు చెప్తున్నారు. అంతేకాకుండా అధిక బరువు పెరగడం, రక్త నాళాల్లో ఆటంకాలు వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. ఆందోళ, డిప్రెషన్ వంటి మానసిక రుగ్మతల బారిన పడతారు.

అధ్యయనంలో భాగంగా నిపుణులు పలువురి గట్ బ్యాక్టీరియాను కొన్నేండ్లపాటు పరిశీలించారు. కాగా తక్కువ కేలరీలు కలిగిన ఆహారం తీసుకునేవారితో పోల్చితే, హై కొలెస్ట్రాల్ కలిగిన ఆహారం తీసుకునేవారు అధిక బరువు పెరగడాన్ని, యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి రుగ్మతల బారిన పడటాన్ని వారు ఈ సందర్భంగా గుర్తించారు. ముఖ్యంగా ఒత్తిడిలో ఉన్నవారు జంక్‌ఫుడ్ తరచుగా తినడం కొనసాగిస్తే శరీరంలోని రక్తనాళల్లో కొవ్వు పెరిగిపోవడంవల్ల స్ట్రోక్, గుండెపోటు వంటి ప్రాణాంతక సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.



Source link

Related posts

వెజిటేబుల్స్ కట్ చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలంటున్న నిపుణులు.. ఎందుకంటే?

Oknews

గర్భధారణ సమయంలో చింతపండు తినకూడదు.. బయటపడ్డ షాకింగ్‌ నిజాలు

Oknews

సెక్స్ తర్వాత సిగరేట్ తాగుతున్నారా? ఎంతటి ప్రమాదమో తెలుసుకోవాల్సిందే..

Oknews

Leave a Comment