EntertainmentLatest News

ఓటీటీలోకి సడన్ గా తెలుగులో వచ్చేసిన 12th ఫెయిల్!


ఓటీటీలో ప్రతీ వారం నాలుగైదు సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అయితే గత కొన్ని రోజులుగా ది కేరళ స్టోరీ, 12th ఫెయిల్ సినిమాలోని కొన్ని సీన్స్, షాట్స్, ఇన్ స్ట్రాగ్రామ్ లో ట్రెండింగ్ లో ఉంటున్నాయి. మరి మీలో ఎంతమంది ఈ రెండు సినిమాలని పూర్తిగా చూశారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో నిన్నటి వరకు హిందీ భాషలో మాత్రమే అందుబాటులో ఉన్న ‘ 12th ఫెయిల్ ‘..  ప్రస్తుతం హిందీ , మలయాళం, కన్నడ, తమిళ్, తెలుగులో ఉంది.

ఈ సినిమా కథేంటంటే.. ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ జీవితం ఆధారంగా రూపొందించిన చిత్రం ఇది. మధ్యప్రదేశ్ లోని ఓ ప్రాంతంలో మనోజ్ కుమార్ శర్మ నిరుపేద కుటుంబంలో జన్మించాడు. మనోజ్ వాళ్ళ నాన్న డ్యూటీలో నిజాయితీగా ఉన్నాడని అతడిని సస్పెండ్ చేస్తారు. ఇక వారి జీవితం గడవడం మరింత కష్టమవుతుంది. ఇక మనోజ్ చదివే స్కూల్ ప్రిన్సిపల్ కాపీ కొట్టమని తనే స్వయంగా ప్రోత్సాహిస్తాడు. ఈ విషయం అక్కడి డీఎస్పీ దుష్యంత్( ప్రియాన్షు ఛటర్జీ) కి తెలియడంతో  ఆ స్కూల్ ప్రిన్సిపల్ ని జైలుకి పంపిస్తాడు. ఇక ఆ సంవత్సరం మనోజ్ కుమార్ 12th ఫెయిల్ అవుతాడు. మరి డీఎస్పీ దుష్యంత్ మాటలని స్పూర్తిగా తీసుకున్న మనోజ్ ఏం చేశాడు? ఈ క్రమంలో మనోజ్ కి ఎదురైన సవాళ్ళేంటనేది మిగతా కథ.

ఈ సినిమాని ఎందుకు చూడాలంటే.. సక్సెస్ ఫుల్ లైఫ్ స్టోరీని ఎవరైనా చూస్తారు. కానీ ఓ ఫెయిల్యూర్ లో నుండి ఎలా సక్సెస్ వైపు నడిచాడు అనే రియల్ స్టోరీని అందరు చూడాలనుకుంటారు. జీవితంలో ప్రతీ ఒక్కరు చూడాల్సిన ‌సినిమాల్లో ఈ సినిమా ఒకటి. మనిషి ఎదుగుదలకి చదువు ఎంతో ముఖ్యం. మధ్యప్రదేశ్, రాజస్థాన్ వైపు మనం రెగ్యులర్ గా ఓ న్యూస్ చూస్తుంటాం.. సివిల్స్ కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు కొంతమంది వారికి దగ్గర్లో ఉన్న రైల్వే స్టేషన్ కి వచ్చి అక్కడి లైట్ల వెలుగులో రాత్రంతా చదువుకుంటారని మనం పేపర్స్ లో రెగ్యులర్ గా చూస్తుంటాం. అలాంటి ఓ పేద కుటుంబాన్ని వచ్చిన ఓ సాధారణ మనిషి కన్న కలని నిజం చేసుకోడానికి ఏం చేశాడనేది తెలియాలంటే పూర్తి సినిమా చూడాల్సిందే. నిన్న మొన్నటి దాకా హిందీలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ సినిమా.. ఈ రోజు నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో తెలుగుతో పాటు మరో నాలుగు బాషలలో అందుబాటులో ఉంది. మరి మీలో ఎంతమంది ఈ సిమిమాని చూశారో కామెంట్ చేయండి. చూడనివాళ్ళు ఓసారి చూసేయ్యండి.

 



Source link

Related posts

KPHB దగ్గర కారులో మంటలు.!

Oknews

బాలయ్య 50 ఏళ్ల సినీ ప్రస్థానం.. ఘనంగా వేడుక!

Oknews

Gold Silver Prices Today 24 March 2024 know rates in your city Telangana Hyderabad Andhra Pradesh Amaravati | Gold-Silver Prices Today: పసిడి తగ్గినా, వెండి దూకుడు

Oknews

Leave a Comment