దేశాన్ని కుదిపేసిన కథ ఇది.. ఎస్ అవును. కేరళలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తీసిన సినిమా ‘ ది కేరళ స్టోరీ’. అయితే ఈ సినిమా రిలీజ్ ముందు ఆ గవర్నమెంట్ నుండి పలు ఆంక్షలు రావడంతో సినిమాని రిలీజ్ ఆపేశారు. ఆ తర్వాత ఎన్నో వాదోపవాదాల తర్వాత ఈ సినిమాకి కోర్టు పర్మిషన్ ఇచ్చింది.
అదా శర్మ, యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్నాని ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘ది కేరళ స్టోరీ’. సుదీప్తో సేన్ దర్శకత్వంలో విపుల్ అమృత్‌లాల్ షా నిర్మించారు. రూ.20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా.. 2023 మే 5న విడుదలై వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.300 కోట్ల గ్రాస్ రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయినప్పటికీ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని తీసుకోవడానికి ఎందుకనో ఓటీటీ సంస్థలు ముందుకు రాలేదు. దీని వెనుక కొందరి కుట్ర ఉందని అప్పట్లో దర్శకుడు సుదీప్తో సేన్ ఆరోపించాడు. అయితే ఎట్టకేలకు రీసెంట్ గా ఓటీటీలోకి అడుగుపెట్టింది కేరళ స్టోరీ. ఇక ఓటీటీలో మూడొందల మిలియన్ వాచ్ మినిట్స్ ని దాటేసింది ఈ మూవీ. మరి ఇంతగా హిట్ అవ్వడానికి కారణమేంటి ఓసారి చూద్దాం.
అసలు ఈ కథలో ఏం ఉందంటే.. హిందూ సంప్రదాయం నుండి వచ్చిన ఓ అమ్మాయి ఓ నేషనల్ కాలేజ్ లో జాయిన్ అవుతుంది. ఇక అక్కడ తనకి కొంతమంది స్నేహితులు అవుతారు. అయితే తన స్నేహితులతో కలిసి అదే కాలేజ్ హాస్టల్ లో ఉండాలనుకుంటుంది. దాంతో ఇంట్లో వాళ్ళని ఒప్పించి హాస్టల్ లో జాయిన్ అవుతుంది. ఇక ఆ తర్వాత తన ముగ్గురు స్నేహితులతో కలిసి సరదాగా మాల్స్ లో తిరిగుతూ షాపింగ్ చేస్తోంది. ఇక ఐసిస్ లోని కొందరు ఆగంతకులు వీళ్ళని ట్రాప్ చేయడానికి మొదటగా ఓ చిన్న గొడవ వాళ్ళే సృష్టించి, వారిని ఆ గొడవ నుండి కాపడటానికి మరో ఇద్దరిని నియమిస్తారు. ఇక ఆ గొడవ తర్వాత వారి నలుగురిని మెల్లగా గంజా, డ్రగ్స్ అలవాటు చేసి మస్లీం మతంలోకి మార్చేస్తారు. ఇక అ తర్వాత ఆమ్మాయిలని బార్డర్ దాటించి ‘ ఐసిస్ ‘ లో చేర్చేలా చేస్తారు. అయితే ఈ సినిమాలో డైరెక్టర్ ఓ నలుగురు అమ్మాయిలు మాత్రమే మిస్ అయినట్టు చూపించారు. వాస్తవానికి కేరళలో కొన్ని ఏళ్ళుగా ‘ 32 వేల మంది ‘ అమ్మాయిలు మిస్ అయినట్టు బయట తెలుస్తోంది. ఓటీటీ వేదిక జీ5 లో తెలుగులో అందుబాటులో ఉన్న ఈ సినిమాని అమ్మాయి ఉన్న ప్రతీ కుటుంబం చూడాలి. అమ్మాయి తీసుకున్న చిన్న నిర్ణయం వల్ల ఆమె తలరాతనే మారిపోయింది. అందుకే ఏదైన సెలెక్ట్ చేసుకునేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. మరిఈ సినిమాని మీరు చూస్తే కామెంట్ చేయండి.