Top Stories

ఓటీటీ హ‌క్కుల‌తోనే.. అక్ష‌రాలా వంద కోట్లు!


త‌మిళ స్టార్ హీరోల సినిమాల స్టామినాకు మ‌రో ప్ర‌తీకగా నిలుస్తోంది అజిత్ రాబోయే సినిమా ఓటీటీ హ‌క్కుల వ్య‌వ‌హారం. విదాముయ‌ర్చి అనే సినిమా ఓటీటీ విడుద‌ల హ‌క్కుల‌ను నెట్ ఫ్లిక్స్ ఏకంగా వంద కోట్ల రూపాయ‌ల‌ను వెచ్చించి కొనుగోలు చేసిన‌ట్టుగా వార్త‌లు వ‌స్తున్నాయి. త‌మిళం, తెలుగు, హిందీ ఇత‌ర అన్ని అనువాదాల‌కూ సంబంధించిన రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసిన‌ట్టుగా స‌మాచారం. 

వాస్త‌వానికి ఇప్పుడు అజిత్ కు అనువాద మార్కెట్ పెద్ద‌గా ఏమీ లేదు. అయితే గ‌త తాలూకు ఇమేజ్ తో సినిమా బాగుందంటే ఓటీటీ వీక్ష‌ణ‌ల‌కు ఇబ్బంది ఏమీ లేదు. ఇలాంటి నేప‌థ్యంతో త‌మిళానికి తోడు.. అన్ని ఓటీటీ విడుద‌ల హ‌క్కుల‌నూ ఇలా ఏకంగా వంద కోట్ల రూపాయ‌ల అంటే భారీ నంబ‌రే అని చెప్పాలి.

కేవ‌లం ఓటీటీ రైట్స్ ద్వారానే వంద కోట్ల రూపాయ‌ల‌ను సంపాదించుకోవ‌డం అజిత్ సినిమాకు మార్కెట్ ప‌రంగా పెద్ద అడ్వాంటేజ్ గా నిలుస్తుంది. కేవ‌లం ఓటీటీ ద్వారానే ఇంత, స‌న్ టీవీ వాళ్లు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను కొనుగోలు చేసిన‌ట్టుగా తెలుస్తోంది. ఓటీటీ వ్య‌వ‌హారాన్ని ఇలా విడుద‌ల‌కు ముందే సొమ్ము చేసుకోవ‌డం స్టార్ హీరోల‌కు అనుకూల‌మైన అంశం. 

విడుద‌ల త‌ర్వాత టాక్ వ‌ర‌కూ వేచి ఉంటే ఓటీటీ మార్కెట్ దెబ్బ‌తినే అవ‌కాశాలూ లేక‌పోలేదు. ఇలా ముందే మార్కెట్ చేసుకోవ‌డం ద్వారా భారీగానే సొమ్ము చేసుకునే అవ‌కాశం ఏర్ప‌డింది. మ‌రి ఓటీటీతోనే వంద కోట్ల రూపాయ‌లు అంటే.. శాటిలైట్, ఇంకా ఇత‌ర డిజిట‌ల్ మార్కెట్ ద్వారా కూడా భారీగానే ఈ సినిమా సంపాదించుకునే అవ‌కాశం ఉన్న‌ట్టే. 



Source link

Related posts

తెలుగులో లియో రిలీజ్ అవుతుందా..?

Oknews

తగ్గేదేలే.. విడుదల తేదీపై తేల్చిచెప్పిన హీరో

Oknews

రిపబ్లిక్ డే కానుకగా సీనియర్ హీరో సినిమా

Oknews

Leave a Comment