Health Care

కండరాలు పెంచడానికి ట్రై చేస్తున్నారా?.. ఈ ఆహారాలు అద్భుతంగా పనిచేస్తాయ్!


దిశ, ఫీచర్స్ : రోజు రోజుకూ యువతలో ఫిట్‌నెస్‌పై ఇంట్రెస్ట్ పెరుగుతోంది. కొందరు మజిల్స్ పెంచడాన్ని అందానికి, అట్రాక్షన్‌కు నిదర్శనంగా భావిస్తుంటారు. అంతేకాకుండా ఆరోగ్యంగా, బలంగా ఉండాలంటే కూడా కండరాల దృఢత్వం చాలా ముఖ్యం. శారీరక కదిలికల్లో అవి కీలకపాత్ర పోషిస్తాయి. మొత్తం బాడీలో రక్షణ కవచంగా నిలుస్తాయి. ఇటీవలి అధ్యయనాల ప్రకారం.. కండరాలు బలంగా, ఫ్లెక్సిబుల్‌గా మారాలంటే ఒక వ్యక్తి కిలోగ్రాము బరువుకు 1.4 నుంచి 2 గ్రాముల వరకు ప్రోటీన్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది ఏయే ఆహారాల ద్వారా లభ్యం అవుతుందో చూద్దాం.

* గుడ్డు : గుడ్డులో హై క్వాలిటీ ప్రోటీన్స్ ఉంటాయి. ఇవి కండరాల నిర్మాణానికి, పునరుద్ధరణకు చాలా ముఖ్యం. కాబట్టి మజిల్స్ పెరగాలనుకునే వారు డైలీ గుడ్లు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే రోజూ రెండు నుంచి మూడు గుడ్లు మాత్రమే తీసుకోవడం బెటర్. అంతకంటే ఎక్కువ కూడా మంచిది కాదు.

*సాల్మన్ ఫిష్ : సాల్మన్ చేపట్లో అద్భుతమైన పోషకాలు ఉంటాయి. ఇవి కండరాల దృఢత్వానికి తీసుకోదగిన ముఖ్యమైన ఆహారంగా నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే వీటిలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. 85 గ్రాముల సాల్మన్ చేపలలో సుమారు 17 గ్రాముల ప్రొటీన్ లభిస్తుందట. అంతేకాకుండా 1.5 గ్రాముల ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. కండరాల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

* చికెన్ బ్రెస్ట్ : మీర నాన్ వెజ్ ప్రియులు అయితే మాత్రం మజిల్స్ పెంచుకోవడానికి చికెన్ బ్రెస్ట్ అన్నింటికంటే ఉత్తమ మార్గం. డైలీ దీనిని వండుకొని తినడంవల్ల కండరాల బలం పెరుగుతుంది. జస్ట్ 85 గ్రాముల చికెన్ నుంచి 26.7 గ్రాముల హై క్వాలిటీ ప్రోటీన్ అందుతుందట. పైగా చికెన్‌లో విటమిన్ బి, బి6 కూడా ఉంటాయి. ఇవి మీ కండరాలను బలంగా మారుస్తాయి.

* సోయా బీన్స్ : కండరాల పెరుగుదలకు, బలానికి సోయాబీన్స్ అద్భుతంగా పనిచేస్తాయి. 86 గ్రాముల బీన్స్‌లో సుమారు16 గ్రాముల ప్రొటీన్ కంటెంట్ ఉంటుంది. మీరు వెజ్‌టేరియన్ అయితే మరో మార్గం ద్వారా ప్రోటీన్లు అందే అవకాశం తక్కువ కాబట్టి తప్పకుండా వీటిని తీసుకోవాలి. అలాగే పప్పుదినుసులు, ఆకుపచ్చ కూరగాయలలో కూడా ప్రోటీన్ లభిస్తుంది. అలాగే ప్రోటీన్ లభించే డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు. అయితే ఆహారాల ద్వారా పొందే ప్రోటీన్ మాత్రమే ఆరోగ్యానికి, సహజమైన కండరాల దృఢత్వానికి మంచిదని, ప్రోటీన్ పౌడర్లు, డ్రింక్స్ అంత మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు.



Source link

Related posts

రోజూ నిద్ర లేవగానే ఇలా చేస్తే అఖండ విజయం మీ సొంతం.. ఈ మూడు శక్తులు మీ వెంటే

Oknews

బూత్ క్యాప్చర్ అంటే ఏమిటి.. ఎప్పుడు జరిగింది..

Oknews

శని దోషంతో బాధపడేవారు.. ఈ పరిహారాలు చేసి చూడండి

Oknews

Leave a Comment