Health Care

కంపెనీ ఎలా రన్ అవుతుందో తెలుసా? డబ్బులు ఎలా వస్తాయంటే..


దిశ, ఫీచర్స్: ఉద్యోగం చేస్తూ ఒకరి కింద బతికే బదులు చక్కగా ఓ బిజినెస్ స్టార్ట్ చేసుకుందాం అనుకుంటారు యంగ్ ఎంట్రప్రెన్యూయర్స్. డ్రీమ్స్ ఫుల్ ఫిల్ చేసుకుంటూ డబ్బు సంపాదించాలని కష్టపడుతుంటారు. అయితే ఇదంతా మాట్లాడినంత సులభం కాకపోగా.. ఇక్కడ రెండు విషయాలు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఒకటి మనం ఉత్పత్తి చేసే ప్రొడక్ట్ లేదా సర్వీస్‌కు కస్టమర్స్‌ను కనుగొనడం.. రెండు దాన్నిప్రొడ్యూస్ చేయడంలో డబ్బు ఆదా చేసే మార్గాన్ని గుర్తించడం. అయితే ఈ ఫార్ములా ఎలా వర్కౌట్ చేయాలో అప్పుడే బిజినెస్‌లోకి ఎంటర్ అవుతున్న వారికి తెలిసే అవకాశం తక్కువే. కాగా ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం కష్టమైన పనే కానీ వీటి ఆధారంగానే కంపెనీ ఆదాయాన్ని పొందుతుందని అంటున్న ఎక్స్‌పర్ట్స్.. కొన్ని సలహాలు అందిస్తున్నారు. 

ఉదాహరణకు మీరు కారు మాన్యుఫాక్చరర్ అయితే.. రా మెటీరియల్, విడిభాగాల ధరను తగ్గించడానికి సప్లయర్స్‌ను ఎంచుకోవచ్చు. కానీ కొద్ది కాలం తర్వాత మళ్లీ ఖర్చు తగ్గించాలని వారిపై ఒత్తిడిని పెంచినట్లయితే.. మీకు సప్లయ్ చేసే మెటీరియల్ నాణ్యత తగ్గిపోవచ్చు. అలాకాకుండా టెక్నాలజీ, న్యూ ప్రాసెస్ ఫాలో అయితే ఎఫిషియెన్సీ పెంచడంలో సహాయపడవచ్చు. ఖర్చులు తగ్గి మరింత లాభాలను ఆర్జించవచ్చు. కానీ మీ వృద్ధి అవసరాలకు అనుగుణంగా ఏడాదికోసారి ఇలాంటివి కనుగొనడం కష్టం. అంతేకాకుండా ఈ కాంపిటేటివ్ మార్కెట్‌లో పోటీదారులను అధిగమించాలనే ఆశతో కస్టమర్‌కు డిస్కౌంట్స్ అందిస్తే ఖర్చు ప్రయోజనాలు కాలక్రమేణా తగ్గిపోతాయి. కాబట్టి ఖర్చులను తగ్గించడం, ఎఫిషియెన్సీస్ బిల్డ్ చేయడం ద్వారా డబ్బు సంపాదించగలిగినప్పటికీ.. కోర్ స్ట్రాటెజీ గ్రోత్ ఫామ్ చేయలేరు. కాబట్టి కస్టమర్‌లను పొందగలగడమే మిగిలి ఉన్న ఎంపిక.

కాగా కంపెనీ తన లక్ష్యాన్ని సాధించడానికి, విజయవంతం కావడానికి.. స్టార్ట్-అప్‌కు రెండు ప్రైమరీ చాలెంజెస్ ఉన్నాయి. మార్కెట్‌ను సెక్యూర్‌గా ఉంచడం, ప్రెడిక్టబుల్ రెవెన్యూస్ క్రియేట్ చేయడం. ఈ చాలెంజెస్‌ను సేల్స్ ప్రాబ్లమ్స్ అని పిలుద్దాం. అయితే ప్రొడక్ట్, డిజైన్, టెక్నాలజీ, టీమ్, ఇన్వెస్ట్‌మెంట్ ముఖ్యమైనవి కాదని దీని అర్థం కాదు. అవి లేకుండా లక్ష్యాన్ని సాధించగలరా? అంటే గోల్‌ను ఎనేబుల్ చేసేవిగా మాత్రమే ముఖ్యమైనవి కానీ ప్రైమరీ ఫోకస్ కాకూడదు. ఎందుకంటే చక్కగా డిజైన్ చేసిన వస్తువులు వాడే వారు లేకుంటే ఏం లాభం? కంపెనీ తన ఉద్యోగులకు చెల్లించడానికి డబ్బు సంపాదించలేకపోతే ఎక్స్‌పరిమెంట్స్ చేయడం వల్ల ప్రయోజనం ఉందా? అంటున్నారు నిపుణులు.



Source link

Related posts

ధనియాల నీళ్లు తాగితే.. ఆ సమస్యలు తగ్గిపోతాయి..!

Oknews

గ్రీన్‌ బీన్స్‌ తింటే..మన శరీరానికి కలిగే లాభాలు ఇవే!

Oknews

చర్మ సమస్యలు గుండె జబ్బులకు దారితీస్తాయా?.. ఈ లక్షణాలు ఉంటే..

Oknews

Leave a Comment