Health Care

కడుపులో గందరగోళమా? .. వీటికి దూరంగా ఉండండి!


దిశ, ఫీచర్స్ : కారణాలేమైనా కడుపులో ఉబ్బరం, గందరగోళం, ఏదో అసౌకర్యం వంటి సమస్యలను ఈ మధ్య చాలా మంది ఎదుర్కొంటున్నారు. బిజీ లైఫ్ షెడ్యూల్, ఇంటిలో వండుకోవడానికి సమయం లేకపోవడం, ఎక్కువగా బయటి ఆహారాలపై ఆధారపడటం వంటివి ఇలాంటి స్టమక్ అప్‌సెట్ ఇష్యూస్‌కి ప్రధాన కారణాలుగా ఉంటున్నాయని పోషకాహార నిపుణులు చెప్తున్నారు. అలాంటప్పుడు తగిన జాగ్రత్తలతోపాటు కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. అవేమిటో చూద్దాం.

స్పైసీ ఫుడ్స్

కారం ఎక్కువగా ఉండే ఆహారాలు రుచిగా అనిపించ్చు కానీ తర్వాత స్టమక్ అప్‌సెట్‌కు దారితీస్తాయి. ఎందుకంటే వీటిలో రకరకాల రసాయనాలు కలుపుతుంటారని నిపుణులు చెప్తున్నారు. అందుకే స్పైసీ ఫుడ్స్ ఆరోగ్యానికి మంచివి కాకపోగా జీర్ణ సమస్యలకు, కడుపులో ఉబ్బరం, గందరగోళం వంటి అసౌర్యానికి కారణం అవుతాయి. కొన్నిసార్లు కడుపు నొప్పి కూడా రావచ్చు. ఈ సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు కొంతకాలం స్పైసీ ఫుడ్స్‌కి దూరంగా ఉండటంవల్ల సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.

కూల్ డ్రింక్స్

పండ్ల రసాలు ఆరోగ్యానికి మంచిదే కానీ, వాటిని బయటి మార్కెట్లో తీసుకున్నప్పుడు మాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే అక్కడ వీటిలో కృత్రిమ చక్కెరలు, ఐస్ వంటివి కలుపుతుంటారు. ఇక సోడాలు, కూల్ డ్రింక్స్ అయితే అస్సలు మంచిది కాదు. వీటిని తాగడంవల్ల కడుపులో యాసిడ్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది అజీర్తి, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పికి దారితీస్తుంది. కాబట్టి మీలో యాసిడ్ రిఫ్లెక్స్ వంటి సమస్యలు కనిపిస్తే వెంటనే వైద్య నిపుణులను సంప్రదించాలి. అలాగే కూల్ డ్రింక్స్‌కు దూరంగా ఉండటం మంచిది.

పచ్చి కూరగాయలు

స్టమక్ అప్‌సెట్‌కు కారణం అయ్యే వాటిలో పచ్చి కూరగాయలు, కొన్ని రకాల పండ్లు కూడా కారణం అవుతుంటాయి. ముఖ్యంగా బత్తాయి, దానిమ్మ, ఆరెంజ్ వంటి సిట్రస్ పండ్లు రాత్రిపూట తినడంవల్ల కూడా కడుపులో గడబిడ, ఛాతీలో మంట, జీర్ణ సమస్యలు వంటివి తలెత్తుతుంటాయి. కాబట్టి కడుపులో అసౌకర్యం వంటివి ఉన్నప్పుడు వీటిని తినకూడదు.

డెయిరీ ప్రొడక్ట్స్

మీరు కడుపులో అసౌకర్యం, ఉబ్బరం వంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నప్పుడు డెయిరీ ప్రొడక్ట్స్‌ను ఆహారంగా తీసుకుంటే సమస్య మరింత అధిరం అవుతుందని ఆహార నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా చీజ్, ఐస్‌క్రీమ్, పాలు వంటి డెయిరీ ఉత్పత్తుల్లో ఫ్యాట్ ఉండటం, వాటిలో ఆర్టిషిషియల్ చక్కెరలు కలపడం కారణంగా సమస్యకు కారణం అవుతాయి. కాబట్టి డెయిరీ ప్రొడక్ట్స్ తీసుకోకపోవడం మంచిది.

ఫ్రైడ్ ఫుడ్స్

అధికంగా కాల్చిన, నూనెలో వేయించిన ఫ్రైడ్ ఫుడ్స్ కూడా కడుపులో అప్‌సెట్ ప్రాబ్లమ్స్‌ను మరింత పెంచుతాయి. పైగా జీర్ణ సమస్యలకు కారణం అవుతాయి. వాటిలో ఆయిల్, ఫ్యాట్ వంటివి ఉంటాయి కాబట్టి కడుపులో అసౌకర్యంగా ఉన్నప్పుడు తింటే స్టమక్ పెయిన్‌కు దారితీస్తుంది. పొట్ట ఉబ్బరం, గ్యాస్ వంటి ప్రాబ్లమ్స్ అధికం అవుతాయని నిపుణులు చెప్తున్నారు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు



Source link

Related posts

కాలిన గాయాలపై కోల్‌గేట్ రాస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్టే!

Oknews

గుర‌క వ్యాధికి చెక్ పెట్టే సింపుల్ చిట్కాలు..

Oknews

గర్భిణులకు అలర్ట్.. పిండాన్నీ వదలని మైక్రోప్లాస్టిక్స్.. ఏం జరగనుందో!

Oknews

Leave a Comment