కడుపు ఉబ్బరం,  గ్యాస్ సమస్యను సింపుల్ గా ఇలా తగ్గించేయచ్చు..! | Ways to Get Rid of Gas Pains and Bloating|Remedies for Bloating|Simple Home Remedies For Bloating|How to avoid bloating after eating


posted on Jul 22, 2024 9:30AM

 

పొట్ట ఉబ్బితే కడుపు బరువుగా అనిపిస్తుంది. దీని వల్ల కడుపులో గ్యాస్ కూడా ఉత్పత్తి అవుతుంది.  కొన్నిసార్లు కడుపు నొప్పితో బాధపడాల్సి వస్తుంది. సాధారణంగా, జీర్ణవ్యవస్థ క్షీణించడ.   ఆహారాన్ని సరిగా  నమలకుండా  తినడం, ఎక్కువ తినడం, స్పైసీ ఫుడ్ తినడం, హార్మోన్ల మార్పులు లేదా పీరియడ్స్ సమయంలో కూడా ఉబ్బరం సమస్య వస్తుంది. ఈ ఉబ్బరం నుంచి బయటపడాలంటే జీవనశైలిలో, ఆహారంలో మార్పులు చేసుకోవచ్చు.  కొన్ని చిట్కాలుప్రయత్నించి ఉబ్బరం నుండి బయటపడవచ్చు.  అవేంటంటే..


నెమ్మదిగా తినాలి..

నెమ్మదిగా,  జాగ్రత్తగా తినడం చాలా ముఖ్యం.  ఆహారాన్ని పూర్తిగా నమలాలి.  ప్రతి ముక్కను నమిలి తినాలి. దీనివల్ల ఆహారంతో పాటు గాలి కడుపులోకి ప్రవేశించదు.  ఇది జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది.

రోజువారీ శారీరక శ్రమ..


ఉబ్బరం వంటి సమస్యలను నివారించడానికి ప్రతిరోజూ కొంత శారీరక శ్రమ చేయడం ముఖ్యం. వెయిట్ లిఫ్టింగ్, జాగింగ్, వాకింగ్, యోగా లేదా లైట్ స్ట్రెచింగ్ చేయవచ్చు. ఇది జీర్ణవ్యవస్థను చురుగ్గా ఉంచి ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.

హైడ్రేటెడ్ గా ఉండండి..

శరీరంలో నీరు లేకపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే నీరు పుష్కలంగా తాగడం చాలా ముఖ్యం. హైడ్రేటెడ్ గా ఉండడం వల్ల జీర్ణవ్యవస్థ సజావుగా పని చేస్తుంది.  మలబద్ధకం వల్ల ఉబ్బరం ఏర్పడదు.

సోడియం..


అధిక ఉప్పు శరీరం నుండి నీరు గ్రహిస్తుంది.  ఇది ఉబ్బరానికి దారితీస్తుంది. అందుకే తాజా తృణధాన్యాల ఆహారాన్ని తినడం చాలా ముఖ్యం. అలాగే తక్కువ ప్రాసెస్ చేసిన ఆహారాలు,  తక్కువ  సోడియం స్నాక్స్ తీసుకోవాలి.

 శ్వాస..

 

డయాఫ్రాగ్మాటిక్ లేదా పొట్ట ద్వారా శ్వాస తీసుకోవడం ద్వారా ఉబ్బరం తగ్గుతుంది. దీన్నే డీప్ బ్రీడింగ్ లేదా పొట్ట నుండి గాలి పీల్చడం అంటారు. కడుపు నుండి మాత్రమే లోతైన శ్వాస తీసుకోవడానికి ప్రయత్నించండి. పొట్టను బాగా లోపలికి తీసుకుంటూ శ్వాసను తీసుకోవాలి.  దీని వల్ల ఉబ్బరం సమస్య ఉండదు.


                                                      *రూపశ్రీ.



Source link

Leave a Comment