EntertainmentLatest News

కమెడియన్ యోగిబాబు తో జత కట్టనున్న టాప్ హీరోయిన్ 


కొన్ని నెలల క్రితం హీరో విశాల్ కి తమిళ చిత్ర పరిశ్రమకే చెందిన  లక్షి మీనన్ కి పెళ్లి అవ్వబోతుందనే వార్త వచ్చింది. అప్పట్లో వచ్చిన ఆ వార్త దక్షిణ భారతీయ చిత్ర పరిశ్రమ మొత్తాన్ని ఒక కుదుపు కుదిపింది. ఇప్పుడు లక్షిమీనన్ నటించబోయే తదుపరి సినిమా హీరో విషయంలో అంతే సంచలనం  సృష్టిస్తుంది.

తమిళ చిత్ర సీమలో లక్షిమీనన్ కి ప్రత్యేక స్థానం ఉంది. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన లక్షిమీనన్ తన తదుపరి సినిమాని  కమెడియన్ యోగిబాబు తో కలిసి చేయనుంది.యోగిబాబు పక్కన హీరోయిన్ గా లక్షిమీనన్  స్క్రీన్ షేర్ చేసుకోబోతుందనే   వార్త తమినాడు చిత్ర పరిశ్రమ మొత్తాన్ని ఒక కుదుపు కుదుపుతుంది. లక్షిమీనన్ యోగిబాబు లు కలిసి నటించబోతున్నారనే వార్తని  త్వరలోనే చిత్ర బృందం  అధికారకంగా ప్రకటించనుంది. లక్ష్మి మీనన్ ఇటీవలే చంద్రముఖి 2 లో సూపర్ గా నటించి అందరి ప్రశంసల్ని అందుకుంది.

2011 వ సంవత్సరం లో రఘువింటే స్వంతం రసియా అనే మలయాళ సినిమా ద్వారా వెండి తెర ప్రవేశం చేసిన లక్ష్మి మీనన్ ఆ తర్వాత తమిళంలో వరుసపెట్టి సినిమాలు చేసింది. సుందర పాండియన్,  కుంకీ ,కుట్టి పులి,జిగర్తాండ, పాండియ నాడు, నా సిగప్పు మనితన్, నా బంగారు తల్లి,అవతారం ,కొంబన్ ,వేదాళం, మీరుతన్,రెక్క ఇలా ఎన్నో చిత్రాల్లో నటించి అశేష అభిమానులని సంపాదించుకుంది. విశాల్, సూర్య, విజయ్ సేతుపతి ,అజిత్ లాంటి అగ్ర హీరోలందరి తో కలిసి నటించిన లక్షిమీనన్ ఇప్పుడు యోగిబాబుతో కలిసి నటించడం పెద్ద సంచలనమే.  

 



Source link

Related posts

పూరి జగన్నాథ్ కి షాకిస్తున్న మాస్ రాజా!

Oknews

Ayodhya Prasad Selling Online Central Government Sent Notices To Amazon | Amazon News: అమెజాన్‌లో అయోధ్య ప్రసాదం

Oknews

Gopichand Bhimaa should hit with the movie ఈ హీరోకి హిట్ అనివార్యం

Oknews

Leave a Comment