Telangana

కరీంనగర్ లో అక్రమంగా ఇల్లు కూల్చిన ముఠా అరెస్టు…నిందితులకు 14 రోజుల రిమాండ్…-gang arrested for illegally demolishing house in karimnagar accused remanded for 14 days ,తెలంగాణ న్యూస్



Karimnagar Police: నకిలీ ధృ పత్రాలు fake Documents సృష్టించి అక్రమంగా ఇంట్లోకి చొరబడి ఇల్లు కూల్చడమే కాకుండా ప్రజలను భయబ్రాంతులకు గురి చేసిన ముఠాకు చెందిన ఐదుగురిని కొత్తపల్లి పోలీసులు అరెస్టు చేశారు.కరీంనగర్ Karimnagar ఆదర్శనగర్ AdarshNagar కు చెందిన మొహమ్మద్ లతీఫ్ (38) 2017 జులైలో రేకుర్తిలోని సర్వే నెంబర్ 194 లో గల 61వ ప్లాట్, 248 చదరపు గజాల ఇంటి స్థలాన్ని, సిద్దిపేట జిల్లా ప్రశాంత్ నగర్ కు చెందిన సయ్యద్ జైనాబీ భర్త నిజామొద్దీన్ నుండి కొనుగోలు చేశారు.ఆ స్థలంలో నివసించుటకు సంబంధిత గ్రామ పంచాయితీలో ఇంటి నిర్మాణానికి అనుమతి పొంది, ఇంటిని సైతం నిర్మించుకుని నివసిస్తున్నారు. ఇదిలా ఉండగా 2023 మే13న అకస్మాత్తుగా ఐదుగురు విద్యానగర్ కు చెందిన బారాజు రత్నాకర్ రెడ్డి, సాయినగర్ కు చెందిన చందా శంకర్ రావు, రేకుర్తి కి చెందిన బకిట్ సాయి, జ్యోతినగర్ కు చెందిన పిట్టల మధు, ముకరంపురకు చెందిన షాహిద్ ఖాన్ లు దౌర్జన్యంగా ఇంట్లో చొరబడి భీభత్సం సృష్టించారు.ఇంట్లో వారిని బలవంతంగా బయటకు నెట్టిసి జేసీబీ తో ఇంటిని కూల్చి House Demolished వేశారు. కాలనీలో పలు ఇళ్ళను ద్వంసం చేశారు. నకిలీ ధృవపత్రాలతోపాటు సయీద్ ఖాన్ వారసులతో డెవలప్మెంట్ కింద అగ్రిమెంట్ కూడా అయిందని, దానికి సంబందించిన ఒక నకిలీ జిరాక్స్ అగ్రిమెంట్ Fake documents డాక్యుమెంట్ కాపీ చూపించి ఇళ్ళు ఖాళీ చేయాలనీ లేని యెడల చంపేస్తామని బెదిరింపులకు గురి చేసారని బాధితుడు లతీఫ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొత్తపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.విచారణ అనంతరం బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు వాస్తవమేనని తేల్చి ఐదుగురిపై ఐపీసీ 452, 448, 427, 506, 467, 468, 120-B, r/w 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశ పెట్టగా మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు ఐదుగురిని కరీంనగర్ జైలుకు తరలించారు.పోలీసుల చర్యలతో అక్రమార్కుల వెన్నులో వణుకుభూ అక్రమ దందాలపై పోలీసులు దూకుడు పెంచడంతో భూ మాఫియాకు పాల్పడే వారి వెన్నులో వణుకు పుడుతుంది. ఇప్పటికే పలువురు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో పాటు బిఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసి జైల్ కు పంపారు. కేసులు, అరెస్టులు ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. తరుచూ భూదందాల కేసులో అరెస్టు అవుతున్న క్రమంలో అందరి నోళ్లలో ఈ అంశం నానుతూనే ఉంది. దీనివల్ల బీఆర్ఎస్ పార్టీ ప్రజల నుండి వ్యతిరికేతను ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉన్నాయి.ఛాలెంజ్‌గా చర్యలు చేపట్టిన సీపీ…భూ దందాలపై ఉక్కు పాదం మోపుతామని ప్రభుత్వం ప్రకటించడంతో కరీంనగర్ సీపీ అభిషేక్ మోహంతి ఛాలెంజ్ గా తీసుకొని అరెస్టుల పరంపర కొనసాగిస్తున్నారు.‌ ప్రత్యేకంగా ఎకనామిక్ ఆఫెన్స్ వింగ్ ఏర్పాటు చేసి బాధితులు చేసే ఫిర్యాదులపై ఆధారాలు సేకరించి చట్ట ప్రకారం చర్యలు చేపడుతున్నారు.‌రాష్ట్రంలోనే అత్యధికంగా భూ దందా కేసులు కరీంనగర్ లోనే నమోదై ఇప్పటికే 30 మందికి పైగా అరెస్టు అయ్యారు. అరెస్టు అయిన వారిలో ఓ తహసిల్దార్, రెవెన్యూ ఉద్యోగులతోపాటు పది మంది కార్పోరేటర్ లు వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. అందులో బిఆర్ఎస్ నాయకులు ఎక్కువగా ఉండడంతో ఎంపీ ఎన్నికల్లో ప్రతికూల పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన చెందుతున్నారు.(రిపోర్టింగ్ కేవీ.రెడ్డి, కరీంనగర్)



Source link

Related posts

Inter Caste Marriage: ప్రేమ పెళ్లే మా నేరమా..? మా బిడ్డ పరిస్థితి ఏంటి..?

Oknews

TS TET 2023 Initial Keys Released, Check Answers Here And Raise Objections If Any

Oknews

ప్రేమ పేరుతో సోదరికి వేధించిన యువకుడు, మందు పార్టీ ఇచ్చి మర్డర్ చేసిన సోదరుడు-hyderabad crime news in telugu youth murdered man who harasses sister love matter ,తెలంగాణ న్యూస్

Oknews

Leave a Comment