EntertainmentLatest News

‘కల్కి’ కలెక్షన్ల జోరు.. ‘ఆర్ఆర్ఆర్’ ప్లేస్ కి ఎసరు!


‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD) బాక్సాఫీస్ ఊచకోత కొనసాగుతోంది. భారీ అంచనాలతో జూన్ 27న థియేటర్లలో అడుగుపెట్టిన ఈ మూవీ.. ఆ అంచనాలను అందుకొని కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. కేవలం తొమ్మిది రోజుల్లోనే రూ.800 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరిన కల్కి.. 1000 కోట్ల దిశగా దూసుకుపోతోంది.

కేవలం నాలుగు రోజుల్లోనే రూ.500 కోట్ల క్లబ్, ఆరు రోజుల్లోనే రూ.700 కోట్ల క్లబ్ లో చేరిన కల్కి.. తొమ్మిది రోజుల్లో రూ.800 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ చిత్రం ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టినట్లు తెలుపుతూ తాజాగా మేకర్స్ పోస్టర్ ను వదిలారు. ఇక 10వ రోజు, 11వ రోజు శని, ఆదివారాలు కావడంతో.. ఈ రెండు రోజులు కలెక్షన్లు పెరుగుతాయి అనడంలో సందేహం లేదు. దాంతో రెండు వారాల లోపే ఈ చిత్రం 1000 కోట్ల క్లబ్ లో చేరే అవకాశముంది.

అత్యధిక వసూళ్లు రాబట్టిన తెలుగు సినిమాల్లో రూ.1800 కోట్ల గ్రాస్ తో ‘బాహుబలి-2’,  రూ.1300 కోట్ల గ్రాస్ తో ‘ఆర్ఆర్ఆర్’ టాప్ లో ఉన్నాయి. రూ.800 కోట్ల గ్రాస్ తో ప్రస్తుతం ‘కల్కి’ మూడో స్థానంలో ఉంది. ఇదే జోరు కొనసాగితే ఫుల్ రన్ లో ‘ఆర్ఆర్ఆర్’ని క్రాస్ చేసినా ఆశ్చర్యంలేదు అంటున్నారు.



Source link

Related posts

ఎన్టీఆర్ కు షాకిచ్చేలా ఉన్న ‘సలార్’ స్టార్!

Oknews

వైసీపీ ని ఇలా తగులుకున్నావేమిటయ్యా..!

Oknews

ఖోఖో మూవీ రివ్యూ

Oknews

Leave a Comment