ప్రస్తుతం ‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD) మూవీ ప్రభంజనం కొనసాగుతోంది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. మరోవైపు అప్పుడే ఈ మూవీ పార్ట్-2 గురించి కూడా ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. పార్ట్-2 ఎప్పుడొస్తుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ‘కల్కి 2’ (Kalki 2) రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చేసింది.
‘కల్కి’ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్న నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ (Aswani Dutt) తన ఆనందాన్ని పంచుకున్నారు. అలాగే, ‘కల్కి-2’ కి సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చారు. అసలు కథ పార్ట్-2 లోనే మొదలవుతుందని, అది అద్భుతంగా ఉంటుందని అశ్వనీదత్ అన్నారు. అంతేకాదు, ఇప్పటికే కల్కి పార్ట్-2 షూటింగ్ దాదాపు 60 శాతం పూర్తయిందని చెప్పి సర్ ప్రైజ్ చేశారు. మేజర్ పోర్షన్స్ షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని, విడుదల తేదీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.
మాములుగా పార్ట్-1 విడుదలైన తర్వాత పార్ట్-2 షూటింగ్ మొదలు పెడుతుంటారు. అలాంటిది కల్కి పార్ట్-1 విడుదలకి ముందే.. పార్ట్-2 షూటింగ్ 60 శాతం పూర్తయిందంటే, ఈ సినిమా పట్ల మేకర్స్ ఎంత నమ్మకంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఇంకా 40 శాతం షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది కాబట్టి.. పార్ట్-2 విడుదలకు ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. అయితే ‘కల్కి’ యూనివర్స్ లో పలువురు సూపర్ స్టార్స్ నటిస్తున్నారు కాబట్టి.. వారి డేట్స్ ని బట్టి మిగతా 40 శాతం షూటింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. ‘కల్కి-2’ వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది అంటున్నారు.