EntertainmentLatest News

‘కల్కి 2898 AD’ ఫస్ట్ రివ్యూ.. ఎలా ఉందంటే..?


ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD). వైజయంతీ మూవీస్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే వంటి ఎందరో ప్రముఖ నటీనటులు నటించారు. జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ విజువల్ వండర్ ని ఎప్పుడెప్పుడు బిగ్ స్క్రీన్ మీద చూద్దామా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.

‘కల్కి 2898 AD’ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు యూ/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ చిత్ర నిడివి 2 గంటల 58 నిమిషాలని సమాచారం. ‘కల్కి’ సినిమాకి సెన్సార్ సభ్యుల నుంచి ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందట. హాలీవుడ్ సినిమాలను తలపించేలా.. విజువల్స్ ఓ రేంజ్ లో ఉన్నాయట. యాక్షన్, ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ అన్నీ సమపాళ్లలో ఉన్నాయట. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ఉందట. అలాగే ఎందరో సినీ ప్రముఖులు గెస్ట్ రోల్స్ లో సందడి చేశారట. మొత్తానికి ‘బాహుబలి’ తర్వాత ఆ స్థాయిలో సంచలనాలు సృష్టించగల సరైన సినిమా ‘కల్కి’ రూపంలో ప్రభాస్ కి వచ్చిందని చెబుతున్నారు.



Source link

Related posts

మెగా డాటర్ నీహారిక పై  టిల్లు మావ కామెంట్స్ అదుర్స్ 

Oknews

'గుంటూరు కారం' కలెక్షన్లు పోస్టర్లకే పరిమితమా!

Oknews

Lokesh phone tapping whose work..? లోకేష్ ఫోన్ ట్యాపింగ్ ఎవరి పని..?

Oknews

Leave a Comment