బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇటీవల పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ వివాదం నడుస్తుండగానే, తాజాగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య కూడా కాంగ్రెస్‌లోకి జంప్ కానున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు.
2014లో కాంగ్రెస్ తరపున చేవెళ్ల నుంచి యాదయ్య గెలుపొందారు. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్‌లో చేరారు. 2018, 23 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఆయన గెలుపొందారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ప్రతిపక్షంలో కూచోడానికి ఇబ్బంది పడుతున్నారు. కాంగ్రెస్‌లోకి వలసలు అడ్డుకోవాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు ప్రయత్నిస్తున్నా, ఫలితం లేకుండా పోతోంది.
ఈ నేపథ్యంలో రేవంత్‌రెడ్డి స్పీడ్ పెంచారు. తమ ప్రభుత్వాన్ని పడగొడతామని హెచ్చరించిన కేసీఆర్‌కు షాక్ ఇచ్చేందుకు రేవంత్‌రెడ్డి ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. బీఆర్ఎస్‌లో హరీష్, కేటీఆర్, హరీష్ మినహా మిగిలిన ఏ ఒక్క ఎమ్మెల్యేని మిగలనివ్వకూడదని ఆయన పంతం పట్టారు.
అధికారం అంటే ఎవరికి చేదు? అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా కాంగ్రెస్‌లోకి వెళుతున్నారు. యాదయ్య చేరిపోయారు. యాదయ్య తర్వాత కాంగ్రెస్‌లో చేరే ఎమ్మెల్యే ఎవరనే ప్రశ్న ఉదయించింది. దీన్నిబట్టి …కాంగ్రెస్‌లో చేరే మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారనే చర్చకు తెరలేచింది.