ByGanesh
Sat 03rd Feb 2024 11:16 AM
పొన్నియన్ సెల్వన్ మూవీ తర్వాత త్రిష కృష్ణన్ పేరు మరోసారి మార్మోగిపోతోంది. విజయ్ సేతుపతితో 96 తర్వాత మళ్ళీ అంతటి ఫేమ్ పొన్నియన్ సెల్వన్ తోనే త్రిషకి వచ్చింది. ప్రస్తుతం స్టార్ హీరోలతో క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్న త్రిష సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. తరచూ తన లేటెస్ట్ ఫొటోస్ ని షేర్ చేస్తూ అభిమానులకి స్పెషల్ ట్రీట్ ఇస్తుంది. పొన్నియన్ సెల్వన్ మూవీ ప్రమోషన్స్ దగ్గర నంచి ఎక్కువగా త్రిష సారీస్ లోనే కనిపిస్తుంది.
కాంచీపురం పట్టు చీరలో బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. తాజాగా సోషల్ మీడియా X లో ట్రెండ్ అవుతున్న త్రిష కృష్ణన్ కాంచీపురం పట్టు చీరలో హొయలు పోయింది. లైట్ కలర్ పట్టు చీరకి ఆరెంజ్ కలర్ బోర్డర్, అదే కలర్ బ్లౌజ్ లో త్రిష అందంగా, ఆకర్షణగా కనిపించింది. ఆ సారీ కి తగ్గ ఆభరణాలతో త్రిష లూజ్ హెయిర్ తో అచ్చం దేవతలా కనిపించింది. ఉయ్యాల మీద అలా వయ్యారాలు ఒలకబోస్తూ కనిపించిన త్రిష పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Trisha Krishnan in Kanchipuram Saree:
Gorgeous Trisha Krishnan in Kanchipuram Saree