దిశ, ఫీచర్స్ : హిందువులు జరుపుకునే పండుగలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. హిందూ క్యాలెండర్ ప్రకారం, ఒక నెలలో రెండు ఏకాదశులు వస్తాయి. ఒకటి శుక్ల పక్షంలో, ఇంకొకటి కృష్ణ పక్షంలో వస్తుంది. ఈ పండుగలకు ఉపవాసాలు ఉండి వారి ఇష్ట దైవాలను పూజిస్తారు. ఈ రోజున ఏ పూజలు చేసిన మంచి ఫలితం ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
పంచాంగం ప్రకారం, ఆషాడ మాసంలో వచ్చే తిథిని కామిక ఏకాదశి అంటారు. ఈసారి జూలై 31 న ఈ పండుగను జరుపుకోనున్నారు. జూలై 30 సాయంత్రం 04:44 కి మొదలై జూలై 31 మధ్యాహ్నం 03:55 గంటలతో ముగుస్తుంది.
ఈ ఏకాదశి రోజున ప్రత్యేక యోగాలు ఏర్పడనున్నాయి. ఇదే రోజున ధృవ యోగం కూడా ఏర్పడుతోంది. ఈ యోగం చాలా ప్రత్యేకమని జ్యోతిష్యులు అంటున్నారు. ఈ సమయంలో మహా విష్ణువును పూజ చేస్తే మంచి జరుగుతుందని చెబుతున్నారు. పెళ్లి కానీ వారికీ మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంది. మొదలు పెట్టిన ప్రతీ పనిలో విజయం సాధిస్తారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.