Top Stories

కాలగర్భంలో కలవనున్న కాలీ పీలీ టాక్సీలు


ముంబయి మహానగరం పేరు చెప్పగానే ఠక్కున గుర్తొచ్చే అంశం అక్కడ నలుపు-పసుపు రంగులో కనిపించే ట్యాక్సీలు. ఈ రంగుల ఆధారంగా వీటిని అక్కడి జనం ముద్దుగా కాలీ-పీలీ ట్యాక్సీ అని పిలుచుకుంటారు. నిజానికి ఇవి ప్రీమియర్ పద్మిని టాక్సీలు.

6 దశాబ్దాలుగా ముంబయి రోడ్లపై పరుగులుపెట్టిన ఈ టాక్సీలకు ఇప్పుడు కాలంచెల్లింది. ఇకపై కాలీ-పీలీ టాక్సీలు చరిత్రకే పరిమితం కానున్నాయి. ఇవాళ్టి నుంచి ముంబయిలో కాలీ-పీలీ ట్యాక్సీలు తగ్గిపోయాయి. రేపట్నుంచి ఎక్కడైనా కనిపిస్తే వెంటనే రవాణా అధికారులు వాటిని సీజ్ చేస్తారు.

20 ఏళ్ల గడువు దాటిన వాహనాల్ని రోడ్లపైకి అనుమతించడం లేదు. పద్మిని టాక్సీలన్నీ ఎప్పుడో ఆ పరిమితి దాటేశాయి. ఇంకా చెప్పాలంటే, ముంబయి ట్రాన్స్ పోర్ట్ ఆఫీస్ లో చిట్టచివరి కాలీ-పీలీ టాక్సీ 2003, అక్టోబర్ 29న రిజిస్టర్ అయింది. అంటే దీనర్థం, ప్రస్తుతం ముంబయి రోడ్లపై తిరుగుతున్న ప్రతి పద్మినీ టాక్సీ కాలపరిమితి ముగిసిందన్నమాట.

ఇండియాలో తయారైన తొలి 4 సీట్ల సెలూన్ కారు ప్రీమియర్ పద్మిని. ఫియట్ కంపెనీతో కలిసి వాల్ చంద్ గ్రూప్, 1964లో ఈ కార్ల ఉత్పత్తిని ప్రారంభించింది. అప్పట్నుంచి ఇవి భారత్ లో భాగమయ్యాయి. మరీ ముఖ్యంగా ముంబయి సంస్కృతిలో కలిసిపోయాయి. అయితే రవాణా సౌకర్యాలు పెరగడంతో కాలీ-పీలీ టాక్సీలకు ఆదరణ తగ్గింది. పైగా చట్టాలు కూడా మారడంతో, ఈ కార్లు ఇప్పుడు అంతరించిపోక తప్పలేదు.

ఈ టాక్సీలు భారతీయ సినిమాలో కూడా ఓ భాగంగా మారాయి. ఎన్నో సినిమాల్లో ఈ తరహా టాక్సీల్ని చూడొచ్చు. వీటిని కొనుగోలు చేసి, వింటేజ్ కలెక్షన్ కింద గ్యారేజీలో పెట్టుకోవడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు.



Source link

Related posts

అన్నీ సంక్రాంతికే.. సగటు బయ్యర్ ఆవేదన ఇది

Oknews

పక్క రాష్ట్రం నుంచి వచ్చి విమర్శలా…?

Oknews

ఉత్తరాంధ్రాలో కాంగ్రెస్‌కి బోణీ నిల్?

Oknews

Leave a Comment