మహిళా ఎస్సై అరెస్ట్ఉమ్మడి ఆదిలాబాద్ లోని కొమురం భీం ఆసిఫాబాద్(Asifabad) జిల్లా కేంద్రంలో ఓ యాక్సిడెంట్ కేసు(Accident Case)లో రూ.40,000 డిమాండ్ చేసి రూ.25 వేలు తీసుకుంటుండగా మహిళ ఎస్సై ఏసీబీ(ACB Arrested SI) చిక్కారు. ఎస్సై రాజ్యలక్ష్మి తన పరిధిలోకి వచ్చిన ఒక కేసు విషయంలో రూ.40 వేల లంచం డిమాండ్ చేశారు. గత నెల 31న బూరుగువాడ సమీపంలో కారు, ద్విచక్ర వాహనం ఢీ కొట్టుకున్నాయి. ఈ సంఘటనలో మంచిర్యాల జిల్లా నస్పూర్ కు చెందిన యాహిన్ ఖాన్ అనే నిందితుడికి స్టేషన్ బెయిల్, వాహనం తిరిగి ఇవ్వడానికి ఎస్సై రాజ్యలక్ష్మి రూ.40 వేలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రూ.25 వేలకు ఒప్పుకున్నారన్నారు. దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. సోమవారం మూడున్నర గంటల సమయంలో మహిళా ఎస్సై రాజ్యలక్ష్మికి రూ. 25 వేలు అందిస్తుండగా ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ మేరకు ఆమె తీసుకున్న నగదును సీజ్ చేసి, ఎస్ఐను అరెస్టు చేసి కరీంనగర్ కు తరలించారు.
Source link