నాలుగు రోజులు ఇసుక విక్రయాల నిలిపివేతమేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర(Medaram Jatara) దృష్ట్యా ములుగు, భద్రాది కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో ఇసుక విక్రయాలను నిలిపివేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ది సంస్థ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ములుగు, భద్రాది కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో ఈ నెల 21 నుంచి 24 వరకు ఇసుక లోడింగ్(Sand Sales), ఆన్‌లైన్ విక్రయాలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం, ట్రాఫిక్ నియంత్రణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. అదే విధంగా ఇతర జిల్లాలకు పరిమితిలో ఆన్‌లైన్‌లో అనుమతులు విడుదల చేస్తామని స్పష్టం చేశారు.
Source link