Health Care

కీళ్లు, కండరాల నొప్పితో బాధపడుతన్నారా.. రోజూ యోగాసనాన్ని వేస్తే సరి..


దిశ, ఫీచర్స్ : వయసు పెరిగే కొద్దీ తలెత్తే సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ఒక్కోసారి పరిస్థితి మరింత దిగజారుతుంది. వృద్ధుల్లో ఎక్కువగా కనిపించే కీళ్ల నొప్పుల సమస్య వీటిలో ఒకటి. పెరుగుతున్న వయస్సుతో కండరాలు, కీళ్లలో దృఢత్వం సమస్య తరచుగా వృద్ధులలో పెరుగుతుంది. వృద్ధులు కీళ్ల నొప్పితో లేచి కూర్చోవడానికి కూడా ఇబ్బంది పడటం చూస్తూ ఉంటాం. ఆర్థరైటిస్ సమస్య పెరుగుతున్నా కీళ్ల నొప్పులు మరింతగా వస్తుంటాయి. ఈ బాధనుంచి విముక్తి పొందేందుకు నివారణకు రోజూ కొన్ని నిమిషాల పాటు యోగాసనాలు వేయాలంటున్నారు వైద్య నిపుణులు. ఈ ఆసనాలతో నొప్పి నుండి ఉపశమనం కలగడమే కాదు అనేక ఇతర ప్రయోజనాలను కూడా ఉన్నాయంటున్నారు.

ప్రతిరోజు మంచి ఆహారపు అలవాట్లతో పాటు యోగాను అలవాటు చేసుకుంటే 60 ఏండ్ల వయస్సు పై బడిన 16 ఏండ్ల వయస్సు గల వారిలాగా ఎంజాయ్ చేయవచ్చు. అందుకే వృద్ధులు యోగా చేయడం ప్రారంభించాలంటున్నారు. ఇక వృద్దులు వేయగల ఆసనాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

తడాసనం.. కండరాల నొప్పి నుండి ఉపశమనం

ఈ ఆసనం చేయడం పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ చాలా సులభం. దీని కోసం నిటారుగా నేల పై నిలబడండి. తర్వాత మీ చేతులను పైకి లేపి లైట్ స్ట్రెచ్ చేయండి. అలా చేసి 8 నుంచి 9 సార్లు శ్వాసలను తీసుకోండి. కొన్ని సెకన్లపాటు అలాగే ఉంచి మళ్లీ పొజిషన్ కి రావాలి. ఈ ఆసనాన్ని రెండు మూడు సార్లు రిపీట్ చేయవచ్చు.

బలాసనం..

వృద్ధాప్యంలో ప్రతిరోజూ బలాసనం సాధన చేస్తే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఈ ఆసనం జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా మనస్సును ప్రశాంత పరుస్తుందని చెబుతున్నారు. మహిళల్లో మెన్సెస్ సమయంలో సంభవించే సమస్యలకు కూడా ఇది ఎంతగానో మేలు చేస్తుంది. ఈ ఆసనం మోకాలు, చీలమండలు, వెనుక కండరాలను సాగదీస్తుంది.

ఈ ఆసనం వేయడానికి రెండు కాళ్లను మోకాళ్ల వద్ద వంచి, మడమల మీద శరీర బరువుతో కూర్చోండి. తరువాత రెండు మడమలను దగ్గరగా ఉంచండి. ఇప్పుడు హాయిగా ముందుకు వంగి తలను నేల పై ఉంచి చేతులు ముందుకు ఉంచాలి. ఈ పొజిషన్ లో 20 నుండి 30 సెకన్ల పాటు ఉండాలి. ఈ ఆసనం 3 నుండి 4 సార్లు వేయవచ్చు.

పవన్ముక్తాసనం..

వయసు పెరిగే కొద్దీ నడుము, వెన్ను నొప్పి సమస్య చాలా సాధారణం. అలాగే మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలను కూడా ఎదుర్కొంటారు. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి పవన్ముక్తాసనం చాలా ఉపయోగపడుతుంది.

ఈ ఆసనం వేసేందుకు మొదటిది యోగా మ్యాట్‌ పై మీ వెనుక భాగంలో పడుకుని గట్టిగా శ్వాస తీసుకోవాలి. ఇప్పుడు నిదానంగా శ్వాస వదులుతూ రెండు కాళ్ళు మోకాళ్లను వంచి పొట్ట వైపునకు తీసుకొచ్చి చేతులతో పట్టుకోవాలి. కొన్ని సెకన్ల పాటు అలాగే ఉంచి మళ్లీ పాత స్థితికి రావాలి.

రోజూ కొన్ని నిమిషాలు ప్రాణాయామం..

పెరుగుతున్న కాలుష్యం కారణంగా చిన్న వయసులోనే శ్వాసకోశ సమస్యలు మొదలవుతున్నాయి. కాబట్టి అనులోం-విలోమ్, భస్త్రిక వంటి ప్రాణాయామం రోజూ చేయాలి. ఇవి ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచేందుకు ఎంతో సహాయపడుతుంది.

తిన్న తర్వాత వజ్రాసనం..

జీర్ణక్రియ మందగించడం కూడా వయస్సు పెరుగుతున్న కొద్ది వచ్చే సాధారణ సమస్య. ఇందుకోసం ప్రతిరోజూ భోజనం చేసిన తర్వాత కొంత సమయం పాటు నడవడం అవసరం. మీరు బయటకు వెళ్లలేక పోతే ఇంట్లో కొన్ని నిమిషాలు వజ్రాసనంలో కూర్చోవాలి. ఈ యోగాసనాలు రోజూ ఉదయం పూట చేయడంతో పాటు తిన్న తర్వాత కూడా చేయవచ్చు.



Source link

Related posts

రంజాన్‌కు, ఖర్జూరకు ఉన్న సంబంధం ఏంటో తెలుసా?

Oknews

కిడ్నీలో రాళ్లతో బాధపడేవారు వీటిని అసలు తినకూడదు!

Oknews

సెక్స్ తర్వాత సిగరేట్ తాగుతున్నారా? ఎంతటి ప్రమాదమో తెలుసుకోవాల్సిందే..

Oknews

Leave a Comment