దిశ, ఫీచర్స్ : నేటి కాలంలో పానీపూరి దుకాణం మాత్రమే కాదు ఏ దుకాణమైనా నడపడం అంత ఈజీ కాదు. అందుకే చాలా మంది వ్యాపారవేత్తలు ఏదో ఒక కొత్త ఆఫర్ ని పెడుతూ కస్టమర్లని ఆకట్టుకుంటారు. అలాగే వింత వింత పేర్లను పెడుతూ కస్టమర్లను రప్పించుకుంటారు. ఇలాంటి దారిలోనే నడిచారు ఓ వ్యాపారి. కస్టమర్లను ఆకట్టుకునేందుకు తన షాప్ కు ఓ వింత పేరు పెట్టారు. అయితే ఆ షాప్ కి వచ్చే కస్టమర్లు అక్కడి చాట్ టేస్ట్ చూడటం మానేసి షాప్ పేరు చూసి తెగ నవ్వుకుంటున్నారు. ప్రస్తుతం ఆ పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. అదేంటి షాప్ పేరు చూసి ఎందుకు అంత నవ్వుకుంటున్నారు అనుకుంటున్నారా. అయితే అదేంటో మీరే చూడండి.
బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి చాట్ దుకాణాన్ని నడిపిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆ షాప్ కి ఓ వింత పేరు పెట్టారు. ఈ పేరు ఆ నోటా ఈ నోటా చర్చనీయాంశంగా మారింది. అంతే కాదు సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ షాప్ పేరు ఏంటంటే ‘మాజీ గర్ల్‌ఫ్రెండ్ బంగారుపేట చాట్’. వావ్ ఈ పేరు వింటుంటేనే వింతగా ఉంది కదా. ఆ షాప్ కి ఆ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చిందో తెలియదు కానీ కస్టమర్లు మాత్రం పేరును చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ షాప్ కి వచ్చిన వినియోగదారులు పేరును అలా క్లిక్ మనిపించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.