పట్టిసీమ నుంచి లిఫ్ట్ ద్వారా 8500 క్యూసెక్కుల నీటిని కుడికాల్వకు లిఫ్ట్ చేసే అవకాశం ఉంది. పోలవరం కుడి కాల్వల ద్వారా నీటిని మళ్లించి కృష్ణా బేసిన్‌కు తరలించడం 2015లో ప్రారంభమైంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019-23మధ్య పట్టిసీమ లిఫ్ట్‌ను పక్కన పెట్టేశారు. గత ఏడాది కొద్ది రోజులు మాత్రమే వినియోగించారు. నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో డెడ్ స్టోరేజీకి నీటి నిల్వ చేరింది. ఈ పరిస్థితుల్లో ఎగువున ఉన్న శ్రీశైలం, సాగర్, ఆల్మట్టిలో నీరు నిండిన తర్వాత కానీ దిగువకు నీరు వచ్చే పరిస్థితులు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో పట్టిసీమ జలాలు వచ్చేయడంతో రైతుల్లో ఆనందం నెలకొందమి.