కీర్తి సురేష్(keerthy suresh)ఎంత అందంగా ఉంటుందో అంతే అందంగా నటించగలదు. 2016 లో నేను శైలజ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి మహానటి తో అందరి అభిమాన కథానాయికగా మారింది. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి స్టార్స్ తో కూడా జోడి కట్టిందంటే తన స్టార్ స్టేటస్ ని అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ హిందీతో నానా అగచాట్లు పడుతుంది.ఆ విషయం ఏంటో చూద్దాం.
కీర్తి సురేష్ అతి త్వరలో రఘు తాతా(raghuthatha)అనే తమిళ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ అయ్యింది. మలుపులతో కూడిన వినోదంలో మునిగితేలేందుకు సిద్ధంగా ఉండండి అని చిత్ర బృందం ప్రకటించినట్టే ట్రైలర్ ఆసాంతం కూడా నవ్వులని పూయిస్తుంది. కయల్విజి క్యారక్టర్ లో రేపు థియేటర్స్ లో కీర్తి హంగామా ఒక రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తుంది. అలాగే కీర్తి, రవీంద్ర విజయ్ ల మధ్య వచ్చే సంభాషణలు నవ్వులని తెప్పిస్తున్నాయి. అదే విధంగా ఒక అమ్మాయిలా నువ్వెందుకు డ్రెస్ చేసుకోవు అని తల్లి అడిగితే నాకు అచ్చమైన అమ్మాయిలా ఉండాలనే ఆసక్తి లేదని కీర్తి చెప్పడం చాలా బాగుంది.
హిందీ రాని ఒక తమిళ అమ్మాయి ఎలాంటి పరిస్థితులని ఎదుర్కుందనే పాయింట్ తో రఘు తాత తెరకెక్కుతుంది. సుమన్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా కేజిఎఫ్ సిరీస్ తో పాటు కాంతార చిత్రాలని నిర్మించిన విజయ్ కిరంగదుర్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. అగస్ట్ 15 న రిలీజ్ అవుతుండగా ఎం ఎస్ భాస్కర్, దేవదర్శిని, రాజీవ్ ముఖ్య పాత్రలు పోషించారు. ప్రెజంట్ తమిళంలో మాత్రమే రిలీజ్ అవుతుంది.తెలుగు రిలీజ్ తర్వాత ఉంటుందేమో చూడాలి.