ఆ కేసులను ఎత్తివేసేందుకు కృషి చేస్తాకాంగ్రెస్ ప్రభుత్వంలో స్వేచ్ఛగా సమస్యలు విన్నవించుకునే అవకాశం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కేటీఆర్ ను అడ్డుకున్నారని పెట్టిన కేసులను తొలగించేందుకు కృషి చేస్తానని చెప్పారు. కేటీఆర్ అసమర్థత వల్లే కాళేశ్వరం ప్రాజెక్టులోని 9వ ప్యాకేజీ పనులు నిలిచిపోయాయని ఆరోపించారు. ఆ పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. నేరుగా ఎమ్మెల్యే అయ్యి, కేసీఆర్ పుత్రునిగా మంత్రి అయిన కేటీఆర్ కు మంత్రి పదవి పోగానే జీర్ణించుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ తప్ప దేశాన్ని, రాష్ట్రాన్ని ప్రజాస్వామ్య బద్దంగా పాలించే పార్టీ లేదని స్పష్టం చేశారు. గతంలో ప్రజా సమస్యలపై పోరాడేందుకు ఇక్కడికి వచ్చాను…ఇప్పుడు మంత్రిగా సమస్యల పరిష్కారానికి వచ్చానని తెలిపారు. అప్పర్ మానేరు డ్యామ్ అభివృద్ధి పనులపై సీఎంతో హామీ తీసుకున్నామన్నారు.
Source link