Kottu Vs Vellampalli : ఇంద్రకీలాద్రిలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడేళ్ల తర్వాత కృష్ణా నదిలో హంస వాహనసేవ నిర్వహించారు. అయితే ఈ విషయంలోనూ మంత్రి కొట్టు సత్యనారాయణ, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మధ్య వివాదం నెలకొంది. అర్చకులు, అత్యవసర సిబ్బంది తప్ప హంసవాహనంలోకి మరెవరినీ అనుమితించవద్దని మంత్రి కొట్టు సత్యనారాయణ ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. అయితే గతంలో హంసవాహన సేవలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఈవో, కలెక్టర్ సహా వీఐపీలను అనుమతించేవారు. ఇక్కడే అసలు వివాదం మొదలైంది. హంసవాహన సేవ ఎక్కిస్తారని భావించిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్… అందుకు అనుమతి లేదని తెలుసుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రిని తానే హంసవాహనం ఎక్కడంలేదని, వాహనం ఎక్కడానికి వెల్లంపల్లి ఏమైనా అర్చకులా? అయినా ఎవరి పాత్ర వాళ్లు పోషించాలని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.