రోడ్లపై అడ్డదిడ్డంగా పార్కింగ్జాతీయ రహదారి–163పై మెయిన్ జంక్షన్ల వద్ద అడ్డదిడ్డంగా నిలుపుతున్న భారీ వాహనాలు తరచూ ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. తాజాగా జరిగిన యాక్సిడెంట్(Road Accidents) లో ఆలేరుకు చెందిన శ్రీకాంత్, స్రవంతిల మూడేళ్ల కొడుకు చనిపోగా.. ప్రమాదానికి కారణం రహదారిపై నిలిపిన వాహనాలేనని స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ మార్గంలో గోదావరి ఇసుక టిప్పర్లు(Sand Transport Lorries), ఇతర వాహనాలు పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగిస్తుండగా.. టీ, టిఫిన్లు, ఇతర అవసరాల కోసం గుడెప్పాడ్, ఆత్మకూరులాంటి జంక్షన్ల వద్ద ఇష్టారీతిన వాహనాలను పార్క్ చేస్తున్నారు. కనీసం పార్కింగ్ లైట్స్ కూడా వేయకుండా నిలిపి ఉంచుతుండటంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. గతంలో కూడా ఇక్కడ ప్రమాదాలు చోటుచేసుకోగా.. తాజాగా యాక్సిడెంట్ లో మూడు నెలల పసికందు ప్రాణాలు(Infant Died) కోల్పోవడం అందరినీ కలచి వేసింది. దీంతోనే జాతీయ రహదారిపై ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలపకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Source link