Entertainment

క్రికెటర్ షమీ ఫేవరెట్ తెలుగు స్టార్స్ ఎవరో తెలుసా?


తెలుగు సినిమాలకు, తెలుగు హీరోలకు రోజురోజుకి క్రేజ్ పెరిగిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఎందరో సెలబ్రిటీలు సైతం తెలుగు హీరోలను ఇష్టపడటం, తెలుగు సినిమాలను చూడటం చేస్తున్నారు. ఈ లిస్టులో ప్రముఖ ఇండియన్ క్రికెటర్ షమీ కూడా ఉన్నాడు.

ఓ ప్రైవేట్ ఈవెంట్ కోసం తాజాగా హైదరాబాద్ కు వచ్చిన షమీ.. మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను సౌత్ సినిమాలు చూస్తానని.. హీరోలలో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ అంటే తనకు ఎంతో ఇష్టమని షమీ అన్నాడు. ప్రస్తుతం షమీ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

గతంలో ‘పుష్ప’ సినిమాలోని అల్లు అర్జున్ మేనరిజమ్స్ ని పలువురు క్రికెటర్స్ ఇమిటేట్ చేశారు. ఇప్పుడు షమీ ఏమో తన అభిమాన హీరోలు ఎన్టీఆర్, ప్రభాస్ అని చెప్పాడు. ఈ లెక్కన క్రికెటర్స్ లో తెలుగు హీరోలకి మంచి క్రేజే ఉందని అర్థమవుతోంది.



Source link

Related posts

రిపబ్లిక్‌ డే సందర్భంగా సందడి చేయనున్న సినిమాలివే!

Oknews

రజనీకాంత్, పార్తీబన్ ఫ్యాన్స్ మధ్య వార్ 

Oknews

చిరంజీవి విశ్వంభర లో సునీల్, సందీప్ కిషన్ ల హీరోయిన్లు 

Oknews

Leave a Comment