ఆలయ అభివృద్ధిచాలాకాలం పాటు మారియమ్మన్ కు ప్రత్యేకించి ఓ ఆలయమంటూ లేదు. భక్తులు దాన్నో వెలితిగా భావించారు. 2003లో దేవాలయాన్ని నిర్మించారు. స్థానికులు కూడా వెన్నుదన్నుగా నిలవడంతో పనులు త్వరత్వరగా పూర్తయ్యాయి. ఆ తర్వాత పొరుగు జిల్లాల నుంచి భక్తుల రాక మొదలైంది. నల్లగొండ, కృష్ణా, వరంగల్, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి సైతం యాత్రికులు వరుస కట్టేసరికి మారియమ్మన్ దేవాలయం ప్రాచుర్యం పొందింది. ఖమ్మం మెట్టు కాస్తా ఖమ్మంగా మారినట్టు ‘మారియమ్మన్’ అనే పేరు కాల క్రమేణా ‘మారెమ్మ’గా( Maremma Temple) రూపాంతరం చెందింది. గడచిన రెండు దశాబ్దాల కాలంగా ఈ దేవతకు ‘మారెమ్మ’ అన్న పేరే స్థిరపడింది. ఇదే క్రమంలో భక్తులు కోరిన కోర్కెల విషయంలో నమ్మకం పెరగడంతో, గురు, శుక్ర వారాలతో పాటు ఆదివారం దేవాలయం వద్ద ఇసుకేస్తే రాలనంత జనం కనిపిస్తారు. ఆలయం రెడ్డిపల్లి ప్రధాన రహదారికి ఆనుకుని ఉండటమూ కలిసొచ్చింది. దేవాలయం వద్ద నెలకొల్పిన ఫంక్షన్ హాల్స్ లో శుభ కార్యాలు నిర్వహిస్తారు. ఏటా సుమారు 5 వేల పెండ్లిళ్లు ఇక్కడ జరుగుతాయి.
Source link