Telangana

గజ్వేల్ లో 10 వేల మందికి గృహలక్ష్మి ఇండ్లు, రెండ్రోజుల్లో ఖాతాల్లో డబ్బులు- మంత్రి హరీశ్ రావు-gajwel minister harish rao says 10 thousand women sanctioned gruhalakshmi houses ,తెలంగాణ న్యూస్


కాంగ్రెస్ అంటేనే అధోగతి

కేసీఆర్ అంటే ప్రగతి అని కాంగ్రెస్ అంటే అధోగతిని మంత్రి హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ అంటే ఒక నాటకం అన్నారు. నాటకాలు ఆడే కాంగ్రెస్ పార్టీని నమ్మితే మోసపోతామన్నారు. కాంగ్రెస్ హయాంలో రైతుల బతుకు దుర్భరమైనదిగా ఉండేదని, తెలంగాణ ఏర్పడినప్పుడు 6, 7 వేల మెగావాట్ల కరెంటు ఉంటే, ఇవాళ 17 వేల మెగావాట్ల విద్యుత్తు ఉందని మూడింతలు ఎక్కువగా కరెంటు వాడుతున్నారన్నారు. దేశంలో 24 గంటలు కరెంటు ఇచ్చే దమ్మున్న లీడర్ కేసీఆర్ అని అన్నారు. కాంగ్రెస్ మూడు గంటల కరెంటు కావాలా? కేసీఆర్ మూడు పంటలు కావాలో.. ప్రజలు ఆలోచన చేసి, పనిచేసే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని మంత్రి కోరారు. కేసీఆర్ వచ్చాక రైతు ఆత్మగౌరవం,ఆత్మ విశ్వాసం, భూమి విలువ పెరిగిందని, గతంలో రైతు ఆత్మహత్యలు ఉండేవని సీఎం కేసీఆర్ హయాంలో రైతే రాజు అనే నినాదం నిజం చేశారని మంత్రి అన్నారు. గజ్వేల్ లోఎక్కువ మెజారిటీతో కేసీఆర్ ను గెలిపిస్తే, కామారెడ్డి నుంచి వద్దు గజ్వేల్ లోనే ఉండాలని కేసీఆర్ ను ఒప్పించే పూచీ నాదన్నారు. ఆయన ఎక్కడుంటే అక్కడ అనుకున్న దానికంటే ఎక్కువ అభివృద్ధి జరుగుతుందన్నారు.



Source link

Related posts

Chevella MP Ticket 2024 : చేవెళ్ల ఎంపీ టికెట్

Oknews

Telangana Election 2023 : ఎల్లారెడ్డిలో మారుతున్న స‌మీక‌ర‌ణాలు.. హస్తం గూటికి ఏనుగు ర‌వీంద‌ర్‌రెడ్డి..?

Oknews

నంది అవార్డుల స్థానంలో గద్దర్ పురస్కారాలు- సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన-hyderabad news in telugu cm revanth reddy announced gaddar awards in place in nandi awards ,తెలంగాణ న్యూస్

Oknews

Leave a Comment