EntertainmentLatest News

గీతా ఆర్ట్స్ లో బోయపాటి మూవీ.. హీరో అల్లు అర్జున్ కాదు..!


‘సరైనోడు’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత అల్లు అర్జున్ మరోసారి చేతులు కలిపారు. త్వరలోనే వీరి కాంబినేషన్ లో సినిమా రానుందని రీసెంట్ గా ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తాడని అందరూ భావిస్తున్నారు. కానీ ఇందులో హీరో బన్నీ కాదట.

ప్రస్తుతం బన్నీ ‘పుష్ప-2’తో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత డైరెక్టర్స్ త్రివిక్రమ్ శ్రీనివాస్, సందీప్ రెడ్డి వంగాలతో సినిమాలు కమిటై ఉన్నాడు. అయితే అవి మొదలు కావడానికి ఎక్కువ టైం పట్టే అవకాశం ఉండటంతో.. ఈలోపు అట్లీ లేదా బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని బన్నీ నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బోయపాటి మూవీ అని ప్రకటన రాగానే అందరూ అల్లు అర్జునే హీరో అనుకున్నారు. కానీ ఇందులో నందమూరి బాలకృష్ణ హీరోనట.

బాలయ్య, బోయపాటిది హ్యాట్రిక్ కాంబినేషన్. ఇప్పటిదాకా వీరి కాంబోలో ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ వంటి బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. వీరు నాలుగోసారి చేతులు కలపడానికి కూడా రెడీగా ఉన్నాడు. తమ కలయికలో నాలుగో సినిమాగా ‘అఖండ-2’ రానుందని గతంలోనే క్లారిటీ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టే గీతా ఆర్ట్స్ లో రూపొందనున్నట్లు తెలుస్తోంది.

అల్లు అరవింద్ కి చెందిన ఓటీటీ వేదిక ఆహాలో ‘అన్ స్టాపబుల్’ అనే షోకి హోస్ట్ గా చేశాడు బాలయ్య. ఆ సమయంలోనే గీతా ఆర్ట్స్ లో సినిమా చేయడానికి బాలకృష్ణ అంగీకరించినట్లు న్యూస్ వినిపించింది. ఆ న్యూస్ ని నిజం చేస్తూ బాలయ్య-బోయపాటిల క్రేజీ కాంబినేషన్ లో అల్లు అరవింద్ ఓ సినిమాని సెట్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ‘అఖండ-2’ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని, ఈ ఏడాది ద్వితీయార్థంలో సెట్స్ పైకి వెళ్లనుందని వినికిడి. అంతేకాదు, బాలయ్య-బోయపాటి కాంబినేషన్ మూవీ పూర్తయ్యాక.. అల్లు అర్జున్-బోయపాటి కాంబోలో కూడా ఒక సినిమా చేయడానికి అల్లు అరవింద్ సన్నాహాలు చేస్తున్నారట.



Source link

Related posts

మంజుమ్మెల్ బాయ్స్ మూవీ రివ్యూ 

Oknews

RC16 క‌థానాయిక‌.. స్టార్ హీరోయిన్ కుమార్తె!

Oknews

Tillu Square OTT date has arrived టిల్లు స్క్వేర్ ఓటీటీ డేట్ వచ్చేసింది

Oknews

Leave a Comment