Entertainment

గుంటూరు కారం టూ వయా సరిపోదా శనివారం..దిల్ రాజు నా మజాకానా 


వ్యక్తుల్ని కాకుండా  కథని స్క్రిప్ట్ ని నమ్ముకొని సినిమాలు నిర్మించే నిర్మాత దిల్ రాజు (dil raju) తన కెరీర్ మొదటినుంచి అదే సూత్రాన్నినమ్ముకొని ఎన్నో అద్భుతమైన చిత్రాలని ఆయన తెలుగు ప్రేక్షకులకి అందించాడు.అలాగే ఎంతో మంది కొత్త వాళ్ళకి దర్శకుడుగా అవకాశం కల్పించి దిల్ ఉన్న ప్రొడ్యూసర్ గా కూడా నిలిచాడు.చాలా సంవత్సరాల నుంచే దిల్ రాజు ఒక సినిమాని  నిర్మించాడంటే ఇక ఆ సినిమా హిట్ అనే పేరుని ఆయన పొందాడు.అలాగే  కొంత కాలం నుంచి దిల్ రాజు ఒక సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసాడంటే కూడా ఆ సినిమా హిట్ అనే పేరుని కూడా పొందాడు. తాజాగా ఆయన ఒక సినిమా డిస్ట్రిబ్యూట్ హక్కులని పొందటం ప్రాధాన్యతని సంతరించుకుంది.

నాచురల్ స్టార్ నాని (nani) హీరోగా  ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూసర్ దానయ్య(danayya) నిర్మాతగా తెరకెక్కుతున్న మూవీ సరిపోదా శనివారం (saripodhaa sanivaram) ఇప్పుడు ఈ సినిమాని రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రదర్శించే హక్కులని దిల్ రాజు పొందాడు. ఈ మేరకు దానయ్య నిర్మాణ సంస్థ అయిన డివివి ఎంటర్ టైన్మెంట్స్ అధికారకంగా ప్రకటించింది. ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలని చూసిన సినీ ప్రేమికులు దిల్ రాజు చెయ్యి పడింది కాబట్టి సరి పోదా శనివారం హిట్ అవ్వడం ఖాయమని అంటున్నారు.

దిల్ రాజు లేటెస్ట్ గా గుంటూరు కారాన్ని డిస్ట్రిబ్యూట్ చేసాడు.ఆ మూవీ టాక్ తో సంబంధం లేకుండా మంచి వసూళ్ళని సాధిస్తు ముందుకు దూసుకుపోతుంది. ఈ సరిపోదా శనివారానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు.ప్రియాంక మోహన్ (priyanka mohan) నాని కి జోడిగా నటిస్తుంది. కొన్నాళ్ల క్రితం విడుదలైన సరిపోదా శనివారం పోస్టర్ మూవీ లవర్స్ ని విశేషంగా ఆకట్టుకుంది.

 



Source link

Related posts

Leo recognizes pharmaceutical drugs from recreational drugs – Feedly Blog

Oknews

సమ్మర్ సినిమా పండుగ.. ఈ వారం థియేటర్, ఓటీటీ రిలీజులు!

Oknews

ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్..!

Oknews

Leave a Comment