బుల్లితెర ఆడియన్స్ కి రష్మీ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన పని లేదు. కొంతమంది సిల్వర్ స్క్రీన్ మెటీరియల్ ఐతే కొంతమంది మాత్రం స్మాల్ స్క్రీన్ మెటీరియల్ గా పేరు తెచ్చుకుంటారు. అలాంటి కోవలోకి వస్తుంది రష్మీ. అటు జబర్దస్త్, ఇటు శ్రీదేవి డ్రామా కంపెనీ షోస్ తో ఫుల్ పాపులర్ అయ్యింది. అప్పుడప్పుడు కొన్ని మూవీస్ లో నటిస్తూ ఉంటుంది రష్మీ.
ఐతే “గుంటూరు టాకీస్” హీరోయిన్‌గా ఫేమ్ తెచ్చుకున్న రష్మీ ఇప్పుడు అందాల రాకుమారుడు మహేశ్‌బాబు నటించిన “గుంటూరు కారం” మూవీలోని ఛాన్స్ ని మిస్ చేసుకుంది. మహేష్ బాబు పక్కన ఆఫర్ వస్తే ఎవరైనా వదులుకుంటారా చిన్న బిట్ లో కనిపించినా చాలనుకుంటారు. అలాంటి రష్మీ ఎందుకు నో చెప్పింది అని ఆరా తీస్తే చాలా విషయాలు తెలిసాయి. గుంటూరు కారం మూవీ ఒక లెక్క అందులోని “కుర్చిని మడతపెట్టి” అనే సాంగ్ ది మరో లెక్క. ఐతే ఈ పాటలో నటించే అవకాశాన్ని రష్మీ మిస్ చేసుకుంది. ఐతే ఈ సాంగ్ లో నటి పూర్ణ ఆకట్టుకుంది. పాట ప్రారంభం నుంచి మధ్యలో కొన్ని స్టెప్పులతో మెరిసింది.
డైరెక్టర్ త్రివిక్రమ్..ఈ క్యారెక్టర్ కోసం పూర్ణ కంటే ముందు రష్మీనే అడిగారట. కానీ, రష్మీ చేయను అని చెప్పిందట. కేవలం ఒక్క పాటలో, కొన్ని సన్నివేశాల్లో మాత్రమే కనిపించే పాత్రలో చేయనని క్లారిటీగా చెప్పేసిందట రష్మీ. దీంతో త్రివిక్రమ్ తర్వాత పూర్ణను కలిసి ఈ ఛాన్స్ గురించి చెప్పేసరికి ఆమె ఓకే చెప్పేసిందట. ఆమె ఒప్పుకోవడంతో ఈ పాట తెరకెక్కించారు. పూర్ణ డాన్స్ ఎంతగా వైరల్ అయ్యిందో అందరికీ తెలుసు. మంచి ఛాన్స్ మిస్ చేసుకుందని చాలా మంది కామెంట్లు పెడతున్నారు. ఐతే కొంతమంది నెటిజన్స్ మాత్రం ఎందుకు మిస్ చేసుకున్నావ్ రష్మీ అంటుంటే పోన్లే మరో మంచి ఛాన్స్ వస్తుందిలే అంటున్నారు. కానీ రష్మీ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తన దారిలో తాను దూసుకుపోతోంది.