ఇప్పటికే మొదటి సెక్షన్ పూర్తి…
పిడుగురాళ్ల – శావల్యాపురం మధ్య 47 కిలోమీటర్ల మేర మొదటి సెక్షన్ ఇప్పటికే పూర్తి చేసి విద్యుదీకరణతో పాటుగా ప్రారంభించింది. నడికుడే-పిడుగురాళ్ల మధ్య ఉన్న సెక్షన్ బీబీనగర్‌ను గుంటూరుతో కలిపే లైన్‌లో ఉంది . శావల్యాపురం-గుండ్లకమ్మ మధ్య ఉన్న సెక్షన్ గుంటూరును గుంతకల్‌తో కలిపే ప్రస్తుత రైలు మార్గంలో వస్తుంది. ఇప్పుడు, గుండ్లకమ్మ – దర్శి మధ్య 27 కి.మీల విస్తరణ పూర్తి చేయడంతో పాటు ప్రారంభించడంతో, నడికుడి – దర్శి మధ్య నిరంతరాయంగా 122 కిలోమీటర్ల రైలు మార్గము, రైలు రాకపోకలు నిర్వహణకు అందుబాటులో ఉంటాయి.