దిశ, ఫీచర్స్: కోడిగుడ్డును ప్రతీ ఒక్కరూ తీసుకోవాలని వైద్యులు సూచిస్తారు. ఎందుకంటే దీనిలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. దీనిలో బి కాంప్లెక్స్ విటమిన్లు, డి విటమిన్, అమైనో ఆమ్లాలు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అయితే, గుడ్డు వెజ్ లేక నాన్ వెజ్ అనే సందేహం అందరికీ వస్తుంది. అయితే, సైన్స్‌లో కూరగాయలు కలిసిన ఆహారాన్ని శాఖాహారం అని పిలుస్తారు. మనం తినే ఆహారంలో కొంచం జంతు మాంస పదార్ధాలు కలిస్తే వాటిని మాంసాహారం అని అంటారు.
మన దేశంలో గుడ్డును మాంసాహారంగా చెబుతారు. అందుకే పూజలు చేసే వారు దీన్ని తినరు. కానీ ఇక్కడ సైన్స్ నుంచి ఆలోచిస్తే .. గుడ్లు రెండు రకాలు. ఒకటి ఫలదీకరణం చెందిన గుడ్లు రెండు ఫలదీకరణం చెందని గుడ్లు. మొదటి దాని నుంచి కోడి పిల్లలు వస్తాయి. ఇక రెండోది తినడానికి మాత్రమే ఉపయోగపడుతుంది.
కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే.. కోడి గుడ్డు పెట్టినంత మాత్రాన అది నాన్ వెజ్ కాదు. జంతువుల నుంచి వచ్చే ప్రతీ దానిని మాంసాహారంగా పిలవకూడదు. దీనికి సరిపోయే ఉదాహరణ పాలు. గుడ్డును నాన్ వెజ్ గా భావిస్తే పాలు కూడా గేదెల నుంచి వస్తాయి మరి దానిని కూడా మాంసాహారంగానే చెప్పాలి. అలా కాకుండా సైన్స్ దీనికి సమాధానం ఇలా చెప్పింది.. గుడ్డు నుంచి కోడిపిల్లలు రాని ఎగ్స్ ని శాఖాహారంగా చెప్పవచ్చని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.