200 యూనిట్లు ఫ్రీ, పై యూనిట్లు బిల్లుకాబట్టి 200 యూనిట్ల కన్నా ఎక్కువ కరెంటు వాడినప్పటికీ, పై యూనిట్లకు మాత్రమే బిల్లు వేసే విధంగా నిబంధనలు రూపొందించాలని హరీశ్ రావు ప్రభుత్వాన్ని కోరారు. 200 యూనిట్లు దాటితే, 200 యూనిట్ల వరకు అయ్యే భారాన్ని ప్రభుత్వమే భరించి, మిగతా యూనిట్ల ధరను వినియోగదారుడు చెల్లించే విధంగా బిల్లింగ్ వ్యవస్థలో మార్పులు చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 90 లక్షల మంది తెల్లరేషన్ కార్డులుంటే(White Ration Card), ప్రభుత్వం కేవలం 30 లక్షల మందికి మాత్రమే ఈ పథకాన్ని అమలు చేస్తుందని ఆరోపించారు. మిగతా 60 లక్షల మందికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. హైదరాబాద్ నగరంలో కూడా 30 లక్షల మంది పేదలుంటే, కేవలం 10 లక్షల మందికే పథకం అమలు చేయాలని నిర్ణయించారన్నారు. మిగతా వారికి నష్టం కలుగుతుందన్నారు. మొత్తంగా కేవలం మూడో వంతు పేదలకు మాత్రమే ఈ పథకం వర్తింపజేస్తున్నారని విమర్శించారు. రెండు వంతుల పేదలను విస్మరిస్తున్నారని, ఇది సరైంది కాదన్నారు.
Source link
previous post