GossipsLatest News

గెలిచే దమ్ముందా.. ఎందుకీ రాద్ధాంతం


అసలు ఏపీ ఎలక్షన్స్ లో సీటిస్తే గెలిచే దమ్ము జనసేన నేతలకి ఉందా? ఏపీ ప్రజల్లో జనసేన నేతల పట్టెంత. పవన్ వెనుక నడుస్తే ఓట్లు పడతాయా? పవన్ కళ్యాణ్ కే తికానా లేదు మీకు ఓట్లేసి ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తారా? ఇప్పటివరకు పవన్ తో పాటుగా నాదెండ్ల మనోహర్ తప్ప పెద్దగా జనసేన లో హైలెట్ అయిన నాయకులు ఎవరున్నారు. ఒకరిద్దరు పేర్లు గట్టిగా వినిపించినా అది కొంతవరకే పరిమితమైంది తప్ప.. జనసేన తరుపున బలమున్న నాయకులు ఎవరున్నారు, మాకు సీటు ఇవ్వకుండా తెలుగు దేశం నాయకులకి సీట్లు ఇచ్చారు, నిన్నగాక మొన్నొచ్చిన మహాసేన రాజేష్ కి సీటిచ్చారు అని, మనోహర్ పై ఎగబడడానికి, రాద్ధాంతం చెయ్యడానికి.. అంటూ నెటిజెన్స్ జనసేన నేతలని చెప్పుకుని రచ్చ చేసే వారిని ప్రశ్నిస్తున్నారు.

టీడీపీతో కలసి పోటీ చేస్తేనే ఏపి ప్రభుత్వాన్ని గద్దె దించుతామని పవన్ ఓపెన్ గానే మాట్లాడారు. అపుడు లేవని నోళ్లు ఇపుడు సీట్లు కేటాయించలేదు అంటూ రోడ్డెక్కి తమ పరువు తామే తీసుసుకుంటున్నారు. వైసీపీ ఛానల్ లో కూర్చుని పవన్ కళ్యాణ్ ని తిట్టిపోస్తున్నారు. అసలు వారికి సీటిస్తే జనసేన తరుపున ఎమ్యెల్యే అయ్యే దమ్ము వాళ్ళకి ఉందా.. మాకు 24 సీట్లు చాలవంటూ గోల గోల చేయడం చూసి జనసైనుకులే తమ వాళ్లపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. పవన్ ని సినిమాలో ఆదరించినట్లుగా రాజకీయాల్లో ఆదరించడం లేదు.

గత ఐదేళ్లుగా పవన్ గ్రాఫ్ ఎంతో కొంత పెరిగింది. అది ఎంత అనేది తెలియదు. ఉన్న 24 సీట్లు గెలిపించి అప్పుడు పవన్ ని ప్రశ్నిద్దామని లేదు, కేవలం తమకి సీట్లు కేటాయించని కారణముగా పవన్ పై పడి ఏడవడం తప్ప, జనసేన జెండాలు చించేసి, స్టిక్కర్లు పీకేసి, కుర్చీలు ఇరగ్గొట్టడం కాదు, గెలిచి చూపించండి అంటూ సోషల్ మీడియా  జనసేన మద్దతుదారులు అడుగుతున్నారు. 

నిజంగానే టీడీపీ తో పొత్తు పెట్టుకుని పొత్తు ధర్మానికి కట్టుబడి సీట్లు త్యాగాలు చెయ్యాల్సి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ఎంతగా నలిగిపోయి ఉంటారో అనేది పక్కనబెట్టి సీటు సీటు అంటూ రోడ్డెక్కి రచ్చ చెయ్యడం ఎంతవరకు కరెక్ట్.



Source link

Related posts

ఈ వారం ఓటీటీలో సినిమా పండుగ!

Oknews

K Kavitha Sent To Jail For 14 Days కవితకు తీహార్ జైలు పర్మినెంటా..?

Oknews

This is the Big Problem to Telugu Desam Party వారందర్నీ సైకిల్ హ్యాండిల్ చేయగలదా?

Oknews

Leave a Comment