EntertainmentLatest News

‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ పై క్లారిటీ వచ్చేసింది!


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అయితే దర్శకుడు శంకర్ ‘ఇండియన్-2’తో బిజీ కావడంతో ‘గేమ్ ఛేంజర్’ ఆలస్యమవుతూ వస్తోంది. అయినప్పటికీ ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని చరణ్ అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. త్వరలోనే వారి ఎదురుచూపులు ఫలించే అవకాశముంది.

‘గేమ్ ఛేంజర్’ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ లో విడుదలయ్యే అవకాశముందని ఇటీవల వార్తలు వినిపించాయి. అయితే శంకర్ డైరెక్ట్ చేస్తున్న ‘ఇండియన్-2’ ఇంకా పూర్తి కాకపోవడం, చాలా రోజులుగా ‘గేమ్ ఛేంజర్’కి సంబంధించిన అప్డేట్స్ లేకపోవడంతో.. సెప్టెంబర్ లో విడుదల కావడం సంగతి అటుంచితే, అసలు ఈ ఏడాదిలో విడుదలవుతుందా అని ఫ్యాన్స్ సందేహం వ్యక్తం చేస్తున్నారు. కానీ అలాంటి డౌట్స్ అక్కర్లేదట. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయిందని అంటున్నారు. జూన్ నెలాఖరుకి లేదా జూలై నాటికి మొత్తం షూటింగ్ కంప్లీట్ అయ్యే అవకాశముందట. ఇప్పటికే ఓ పక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ సకాలంలో పూర్తయితే సెప్టెంబర్ లో విడుదల చేయాలని, లేదంటే డిసెంబర్ లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. మొత్తానికి ఈ ఏడాది లోనే ‘గేమ్ ఛేంజర్’ విడుదల కావడం ఖాయమని తెలుస్తోంది.

కియారా అద్వాణి హీరోయిన్ గా నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో శ్రీకాంత్, ఎస్.జె.సూర్య, సునీల్‌, అంజలి తదితరులు నటిస్తున్నారు. థమన్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా నుంచి ‘జరగండి జరగండి’ అనే సాంగ్ ను కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.



Source link

Related posts

Supreme Court Shock to Koratala Siva శ్రీమంతుడు.. కొరటాలకు సుప్రీంలో షాక్

Oknews

'SSMB 29' మూవీ లాంచ్ కి ముహూర్తం ఖరారు!

Oknews

Anasuya Bharadwaj Slays Traditional Look రెండు జడలు వేసుకున్న పెద్ద పాప

Oknews

Leave a Comment