Entertainment

గోవా బయలుదేరిన ఎన్టీఆర్..దాని కోసమేగా


నందమూరి తారకరామారావు అలియాస్ జూనియర్ ఎన్టీఆర్ అండ్ కొరటాల శివ కాంబినేషన్ లో  ముస్తాబవుతున్న సినిమా దేవర. టైటిల్ కి తగ్గట్టే ఎన్టీఆర్ ని ఆయన అభిమానులు ఎప్పటి నుంచో  తమ అభిమాన దేవర గా కొలుస్తుంటారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న దేవర సినిమా గురించి వచ్చిన ఒక వార్తతో ఎన్టీఆర్  ఫాన్స్  ఫుల్  హ్యాపీ మోడ్ లో  ఉన్నారు.

దేవర సినిమా తాజా షెడ్యూల్ గోవాలో ప్రారంభం కాబోతుంది. ఆల్రెడీ చిత్ర బృందం మొత్తం రెండు రోజుల ముందుగానే అక్కడికి వెళ్ళింది. ఇప్పుడు ఎన్టీఆర్ గోవాకి బయలుదేరి వెళ్ళాడు.  ఎయిర్ పోర్ట్ లో ఎన్టీఆర్ బయలుదేరి వెళుతున్న పిక్స్ ఆల్రెడీ  సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతున్నాయి. ఎన్టీఆర్ అండ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ల మధ్య కొన్ని కీలక సన్నివేశాలని  దర్శకుడు కొరటాల శివ గోవా లో తెరకెక్కించనున్నాడు. కథ కి చాలా ముఖ్యమైన ఆ సీన్స్ మొత్తం పూర్తయ్యే దాకా ఎన్టీఆర్  గోవా లోనే ఉంటాడు. 

ఎన్టీఆర్ అండ్ కొరటాల కాంబినేషన్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కతున్న దేవర మూవీ మీద ఎన్టీఆర్ అభిమానులతో పాటు సాధారణ సినీ ప్రేక్షకులు కూడా ఎన్నో అంచనాలని పెట్టుకున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ అండ్ యువసుధ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ అండ్ మిక్కిలినేని సుధాకర్ ల  నిర్మాణంలో తెరకెక్కుతున్న దేవర సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 



Source link

Related posts

చట్నీ సాంబార్ వెబ్ సిరీస్ రివ్యూ

Oknews

నన్ను చంపొద్దు.. ప్రభాస్ ఫ్యాన్స్ కి అమితాబ్ క్షమాపణలు!

Oknews

అల్లు అర్జున్ రేర్ రికార్డు.. సౌత్ లోనే నెంబర్ వన్!

Oknews

Leave a Comment