Entertainment

గోవా సముద్ర తీరంలో యంగ్ టైగర్


గోవా సముద్ర తీరంలో సందడి చేయటానికి సిద్ధమయ్యారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అసలు ఇంతకీ ఆయన గోవాకు ఎందుకు వెళ్లారా? అనే సందేహం అక్కర్లేదు. తాజాగా తను కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘దేవర’ కోసమే. పాన్ ఇండియా మూవీ కోసం ఎంటైర్ యూనిట్ ఇప్పుడు గోవాలో సందడి చేస్తుంది. అసలు గోవాలో దేవరకు సంబంధించి ఎలాంటి సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కొరటాల శివ ప్లానింగ్ ఏంటి? దేవర అనుకున్న సమయానికి సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేస్తారా లేదా?అనే  వివరాల్లోకెళ్తే..

 

ట్రిపులార్ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్.. కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ మూవీని స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే పక్కా ప్లానింగ్‌తో ముందుకు వెళుతుండటం వల్ల దేవర సినిమాను శరవేగంగా పూర్తి చేసుకుంటున్నారు. ఇందులో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఫ్లాష్ బ్యాక్‌లో తండ్రి పాత్రలో ఎన్టీఆర్‌కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మరీ ముఖ్యంగా యాక్షన్ ఓరియెంటెడ్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. హాలీవుడ్ స్టంట్ మేకర్స్ ఆధ్వర్యంలో ఈ సన్నివేశాలను పూర్తి చేస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న దేవర చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. పాన్ ఇండియా రేంజ్ మూవీగా దేవరను రిలీజ్ చేయాలనుకుంటుడటంతో దర్శక నిర్మాతలు ఈ ఏడాదిలోపు చిత్రీకరణను పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు ప్రమోషన్స్‌కు కూడా తగిన సమయాన్ని కేటాయించాలనుకుంటున్నారు.  

ఎన్టీఆర్‌ను ఢీ కొట్టే పవర్‌ఫుల్ విలన్ భైరవ పాత్రలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. అలాగే తారక్‌కు జోడీగా జాన్వీ కపూర్ కనిపించనుంది. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తామని ఇప్పటికే డైరెక్టర్ కొరటాల శివ ప్రకటించారు. ఇందులో తొలి భాగం వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహిస్తున్నారు.



Source link

Related posts

విరాట్ కోహ్లీతో డేటింగ్-బ్రేకప్.. స్పందించిన తమన్నా!

Oknews

‘రాజధాని ఫైల్స్’ మూవీ రివ్యూ

Oknews

విజయ్ సేతుపతి  మళ్లి  అతనితోనే ఎందుకు..

Oknews

Leave a Comment