సూపర్‌స్టార్ మహేష్ సతీమణి నమ్రత తన బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఆమెకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు బర్త్‌డే విషెస్ తెలియజేశారు. బంధు మిత్రుల సమక్షంలో ఎంతో సందడిగా నమ్రత పుట్టినరోజు వేడుక జరిగింది. ఈ సందర్భంగా తన సన్నిహితుల కోసం ఓ గ్రాండ్ పార్టీని ఎరేంజ్ చేసింది నమ్రత. ఈ పార్టీలో పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఇక సితార, గౌతమ్ ఈ పార్టీలో స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యారు. వారిద్దరూ నమత్రతో కలిసి కేక్ కట్ చేశారు. ఆ తర్వాత పార్టీకి వచ్చిన అతిథులంతా నమ్రతతో కలిసి ఫొటోలు దిగారు. అందులో అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డితో పాటు నారా బ్రహ్మాణి కూడా ఉన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.